STOCKS

News


క్రూడ్‌ పతనం.. ఈ షేర్లకు లాభం

Saturday 24th November 2018
Markets_main1543055681.png-22370

ముంబై: ముడిచమురు ధరలు భారీగా దిగివచ్చిన నేపథ్యంలో ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణ భయాలు తగ్గిపోయి ఈనెలలో స్టాక్‌ మార్కెట్‌ కోలుకోగా.. క్రూడ్‌ ధరలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన అనేక కంపెనీల షేర్లు ర్యాలీని నమోదుచేశాయి. అక్టోబర్‌ 3 నుంచి ఇప్పటివరకు ముడిచమురు ధరలు 31 శాతం పతనమవగా.. ఈకాలంలో విమానయాన, టైర్‌, పెయింట్‌ కంపెనీల షేర్లు 6 నుంచి 80 శాతం వరకు పెరిగాయి. గతనెల 3న రూ.177 వద్ద ఉన్నటువంటి విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ (ఇండియా) షేరు ధర ప్రస్తుతం రూ.310 వద్దకు చేరుకుంది. అయితే, ఈషేరు ఇంతలా పెరగడానికి క్రూడ్‌ ధరలు తగ్గడంతో పాటు ఈ సంస్థ టేకోవర్‌పై టాటా సన్స్‌ ఆసక్తిగా ఉండడం కూడా ప్రధాన కారణంగా నిలిచింది. అక్టోబర్‌ 3 నాటికి ఏడాది ప్రాతిపదికన చూస్తే.. భారీగా పతనమైన ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, స్పైస్‌జెట్‌ షేర్లు ఆ తరువాత నుంచి ఇప్పటివరకు వరుసగా 36, 32 శాతం లాభపడ్డాయి. ఇక టైర్ల కంపెనీలలో సియట్‌ 14 శాతం, అపోలో టైర్స్‌ 10 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 3 శాతం లాభపడ్డాయి. బర్జర్‌ పెయింట్స్‌ 13 శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ 6 శాతం లాభపడ్డాయి. ఈ కాలంలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలైన బీపీసీఎల్‌ 13 శాతం నష్టపోగా, ఐఓసీ 10 శాతం, హెచ్‌పీసీఎల్‌ 0.2 శాతం నష్టపోయాయి.



You may be interested

ఓపిక ఉన్న వారికే లాభాలు!

Monday 26th November 2018

ఇటీవలి కరెక్షన్‌ సాధారణ ఇన్వెస్టర్ల పట్టుదలను, సహనాన్ని, ఓపికను తెగ పరీక్షించింది. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు చేయకూడని తప్పులే చేస్తుంటారు. మార్కెట్లు పెరిగినప్పుడు పడడం... అలాగే, పడిన తర్వాత తిరిగి పెరగడం అనేవి ఎప్పుడూ జరుగుతుండే ప్రక్రియలేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈక్విటీలు అంటేనే ఆటుపోట్లతో కూడినవని, ఒక్కసారిగా వచ్చి పడే నష్టాలను ఎదుర్కొనేందుకు మార్గాలు ఉన్నాయని మార్కెట్‌ సీనియర్లు చెబుతున్నారు. లాభాలు గడించాలంటే నష్టాలను

రూ.5,000 కోట్లను సమీకరించనున్న ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌

Saturday 24th November 2018

ముంబై: ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌కు చెందిన ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ విభాగం నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.రూ.5,000 కోట్లను సమీకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ షెల్ఫ్ ప్రాస్పెక్టస్‌ను శనివారం ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలకు అందజేసింది. అయితే, ఈ మొత్తాన్ని ఒకేసారి సమీకరిస్తుందా..లేదంటే, ఏడాదిలో పలుమార్లు పబ్లిక్‌ ఇష్యూకు రావడం ద్వారా సమీకరించనుందా అనే విషయం ఇంకా తేలాల్సిఉంది. 

Most from this category