STOCKS

News


ప్రమోటర్ల ప్లెడ్జ్‌...మార్కెట్‌కు టెన్షన్‌

Wednesday 30th January 2019
Markets_main1548832294.png-23898

దేశీయ కంపెనీల షేర్‌ తనఖాలు మార్కెట్‌లో ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. డిసెంబర్‌ త్రైమాసికం చివరకు దేశీయ ప్రమోటర్లు ప్లెడ్జ్‌(తనఖా) చేసిన షేర్ల విలువ రూ. 2.5 లక్షల కోట్లకు చేరింది. బీఎస్‌ఈ500 కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాప్‌లో ఈ ప్లెడ్జింగ్‌ షేర్ల విలువ దాదాపు 2 శాతం. 2017 చివరలో ప్లెడ్జ్‌ షేర్ల విలువ రూ. 2.4 లక్షల కోట్లు. ఇలా ఎక్కువమొత్తంలో షేర్లను తనఖా పెట్టిన కంపెనీ ప్రమోటర్లలో జీఎంటర్‌టైన్‌మెంట్, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, ఏసియన్‌పెయింట్స్‌ లాంటి దిగ్గజ కంపెనీల ప్రమోటర్లున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

సెప్టెంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌ త్రైమాసికానికి షేర్ల తాకట్టు పెరిగిన కంపెనీల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌, సన్‌ఫార్మా, యస్‌ బ్యాంక్‌ ఉన్నాయి.  ప్రస్తుతం షేర్‌ ప్లెడ్జింగ్‌ అత్యధికంగా చేసిన కంపెనీల్లో సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌(100 శాతం షేర్లు తనఖాలో ఉన్నాయి), స్టెరిలైట్‌ టెక్నాలజీ, గాయత్రీ ప్రాజెక్ట్స్(90 శాతం కన్నా ఎక్కువ) ఉన్నాయి. 80 శాతం కన్నా షేర్లు తాకట్టులో ఉన్న కంపెనీల్లో జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, ఆర్‌పవర్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, డిష్‌టీవీ, మాక్స్‌ ఫిన్‌సర్వ్‌ ఉండగా, 70 శాతం కన్నా అధిక షేర్‌ ప్లెడ్జింగ్‌ జరిపిన కంపెనీల్లో సీసీడీ, సుజ్లాన్‌, మాక్స్‌, అపోలో హాస్పిటల్స్‌, ఆర్‌క్యాప్‌; బజాజ్‌ కన్జూమర్‌ ఉన్నాయి. మరోవైపు డిసెంబర్‌ త్రైమాసికంలో  ఎవెరెడీ ఇండస్ట్రీస్‌; ఇండియా బుల్స్‌ రియల్టీ, సీసీడీ, జైన్‌ ఇరిగేషన్‌, ఇన్ఫీబీమ్‌, జేఎస్‌పీఎల్‌, ఫోర్టిస్‌, సుజ్లాన్‌, అడ్వాన్డ్స్‌ ఎంజైమ్‌ ఉన్నాయి. షేర్ల తనఖా శాతం తగ్గుతుంటే కంపెనీపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. 
ఎందుకు పెడతారు?
షేర్ల తాకట్టు అన్నది కార్పొరేట్‌ రంగంలో నేడు సాధారణంగా మారిపోయింది. కంపెనీల నిర్వహణకు రుణాలు లభించని అరుదైన పరిస్థితుల్లో ప్రమోటర్లు తమ వాటాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటుంటారు. కొన్ని సందర్భాల్లో ఇతర వ్యాపారాలపై పెట్టుబడులకు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టే ప్రమోటర్లు కూడా ఉన్నారు. కంపెనీ ఫైనాన్షియల్‌ అకౌంట్లలో బలహీనతకు నిదర్శనంగా ఈ షేర్ల ప్లెడ్జింగ్‌ను భావిస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్లు నేల చూపులు చూస్తున్న తరుణంలో షేర్లప్లెడ్జింగ్‌ ఊపందుకుంటుంది. గతంలో తాకట్లు పెట్టిన షేర్ల విలువ తరిగిపోవడంతో రుణానికి సమాంతరంగా మరిన్ని షేర్లను తాకట్టు పెట్టాల్సి వస్తుంటుంది. దీంతో షేర్‌ ప్లెడ్జింగ్‌ పెరిగిపోతుంటుంది. మార్జిన్‌ కాల్‌ను సైతం కంపెనీలు చెల్లించలేని తరుణం వస్తే తనఖాదారు తనవద్ద కుదువ పెట్టిన షేర్లను రుణదాత ఓపెన్‌ మార్కెట్లో ఏ రేటు వస్తే ఆ రేటుకు విక్రయించడం కద్దు. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడి హరించకపోతుంది. ఒక్కోసారి షేర్ల ప్లెడ్జింగ్‌తో కంపెనీ మేనేజ్‌మెంట్లలో కూడా మార్పులు వస్తుంటాయి. అందువల్లే షేర్‌ ప్లెడ్జింగ్‌ చేసిన కంపెనీలపై ఇన్వెస్టర్లు శీతకన్ను వేస్తుంటారు. షేర్లను ఎక్కువగా తాకట్టు పెట్టిన కంపెనీలకు సంబంధించి సరైన అధ్యయనం చేసిన తర్వాతే పెట్టుబడులు పెట్టడం మంచిదని నిపుణుల సలహా.

 



You may be interested

8నెలల గరిష్టానికి పసిడి

Wednesday 30th January 2019

కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ యథాతధ పాలసీ అంచనాలు, ట్రేడ్‌ చర్చలు నేపథ్యంలో పసిడి ధర  8నెలల గరిష్టానికి పెరిగింది. ఆసియా ట్రేడింగ్‌లో మంగళవారం ఔన్స్‌ పసిడి 5.50డాలర్లు పెరిగి 1314 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతేడాది మే14 తరువాత పసిడికి ఈ స్థాయిని వద్దకి చేరుకోవడం ఇదే ప్రథమం. అమెరికా న్యాయ విభాగం నిన్న చైనా దేశపు హువాయ్‌ టెక్నాలజీస్‌ సంస్థ సీఎఫ్‌ఓతో పాటు మరో ఇద్దరు అధికారులపై

యాక్సిస్‌బ్యాంక్‌ షేరును ఏంచేద్దాం?

Wednesday 30th January 2019

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ క్యు3లో రూ. 1681 కోట్ల లాభాన్ని ప్రకటించింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు 130 శాతం అధికం. అనలిస్టులు 50- 110 శాతం వరకు లాభంలో వృద్ధి ఉండొచ్చని అంచనా వేశారు. మంచి ఫలితాల నేపథ్యంలో బుధవారం షేరు దూసుకుపోతోంది,. ఈ షేరుపై ప్రముఖ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి. 1. సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు. టార్గెట్‌ను రూ. 800 నుంచి రూ.840కి పెంచింది. ఎర్నింగ్స్‌

Most from this category