STOCKS

News


52 వారాల కనిష్టానికి 200కుపైగా స్టాక్స్‌

Tuesday 11th December 2018
Markets_main1544509556.png-22818

ఎన్‌ఎస్‌ఈలో మంగళవారం మార్నింగ్‌ ట్రేడింగ్‌లో 200కుపైగా స్టాక్స్‌ 52 వారాల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. ఇందులో అబాన్‌ ఆఫ్‌షోర్‌, అరియన్‌ప్రో సొల్యూషన్స్‌, బజాజ్‌ కార్ప్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌, బినాని ఇండస్ట్రీస్‌, సిప్లా, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, జీపీటీ, ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌, హిందుజా వెంచర్స్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, వొడాఫోన్‌ ఐడియా, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్ట్‌, జైన్‌ ఇరిగేషన్‌, లక్స్‌ ఇండస్ట్రీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎన్‌బీసీసీ, ఎన్‌టీపీసీ, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌, సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, వాటెక్‌ వాబాగ్‌ వంటి షేర్లు ఉన్నాయి. జేఐకే ఇండస్ట్రీస్‌, పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌, కావేరీ టెలికం, యూని ఇన్ఫో టెలికం సర్వీసెస్‌, పుంజ్‌ లాయిడ్‌ వంటి స్టాక్స్‌ కూడా 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. మరోవైపు టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌ స్టాక్‌ మాత్రం కొత్తగా 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. 
ఉదయం 11:50 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో సన్‌ ఫార్మా, యస్‌ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ వంటి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సన్‌ ఫార్మా, యస్‌ బ్యాంక్‌ షేర్లు 5 శాతానికి పైగా పెరిగాయి. ఇక హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌పీసీఎల్‌ 2 శాతానికి పైగా నష్టపోయింది. ఇక బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు పూర్తిగా రికవరీ అయ్యాయి. ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. 
 



You may be interested

ఎన్నికల ఫలితాల వేళ ఎలా ట్రేడ్‌ చేయాలి?

Tuesday 11th December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌లు, అనలిస్టుల సలహాలు దలాల్‌ స్ట్రీట్‌ మొత్తం ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ దెబ్బకు సూచీలు సోమవారం 2 శాతం మేర ఢమాల్‌మన్నాయి. మరి మంగళవారం నిజ ఫలితాల వేళ సూచీల స్పందన ఎలాఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నారు. వీరి ఆందోళనకు తగ్గట్లే ఆరంభంలో సూచీలు నష్టాలతో ట్రేడయ్యాయి. మధ్యాహ్న సమయానికి కాస్త కోలుకొని ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల

ఉర్జిత్‌ రాజీనామాపై బ్రోకరేజ్‌ల రియాక‌్షన్‌!

Tuesday 11th December 2018

వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే! కేంద్ర బ్యాంకుకు, కేంద్రానికి మధ్య బయటకు కానరాని విబేధాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉర్జిత్‌ రాజీనామా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉర్జిత్‌ రాజీనామాతో దేశీయ మార్కెట్లు అధోముఖ పయనం ఆరంభించాయి. ఈ నేపథ్యంలో ఉర్జిత్‌రాజీనామా వ్యవహారంపై ప్రముఖ బ్రోకరేజ్‌లు స్పందించాయి. ఈ వ్యవహారం మార్కెట్లపై ప్రభావం చూపడం ఖాయమని కానీ ఇది తాత్కాలిక వ్యవహారమేనని బ్రోకరేజ్‌లు అభిప్రాయపడుతున్నాయి.  -

Most from this category