STOCKS

News


షేర్ల బైబ్యాక్‌ అన్ని సమయాల్లోనూ మంచిదేనా?

Monday 8th April 2019
Markets_main1554662372.png-24998

షేర్ల బైబ్యాక్‌ (వాటాలను తిరిగి కొనుగోలు) ఇన్వె‍స్టర్లకు ఎప్పుడూ మంచిదేనన్న అభిప్రాయం ఒకటి ఉంది. కంపెనీ పనితీరు చక్కగా ఉందన్న సంకేతాన్ని ఇది ఇస్తుందనుకుంటారు. కానీ, బైబ్యాక్‌లు అన్నింటినీ ఒకే గాటన కట్టొద్దు. షేర్ల బైబ్యాక్‌ నిజంగా ఇన్వెస్టర్లకు మేలు చేసేదేనా? అన్నది తెలుసుకోవాలంటే ఉద్దేశ్యాలు అర్థం చేసుకోవాలి.  

 

షేరు ధర చౌకగా ఉండడమే కంపెనీలు బైబ్యాక్‌ నిర్ణయం తీసుకునేందుకు ప్రోత్సాహకరమని వారెన్‌ బఫెట్‌ అంటారు. ‘‘30-40 ఏళ్ల క్రితం అయితే బైబ్యాక్‌ చేస్తున్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచి రాబడులను ఇచ్చేది. కానీ, ఇప్పుడు ఇది మారిపోయింది. కంపెనీలు దీన్నొక ఫ్యాషన్‌గా లేక స్టాక్‌ ధర పతనాన్ని నిరోధించేందుకు వినియోగిస్తున్నాయి. ఆ కారణాలతో ఇది చేయకూడదు’’ అని బఫెట్‌ 2006 నాటి సమావేశంలో పేర్కొన్నారు.  

 

బైబ్యాక్‌కు సరైన సమయం?
కంపెనీ వద్ద సరిపడా నిధులు ఉండాలి. సమీప కాలంలో నిధుల అవసరాలకు మించి అదనపు నిధుల లభ్యత ఉండాలి. మార్కెట్లో కంపెనీ షేరు దాని అంతర్గత విలువ కంటే తక్కువకు ట్రేడ్‌ కావాలి. అవసరానికి మించి నిధులున్నప్పుడు కంపెనీ తన వాటాలను తిరిగి కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి కంపెనీ షేరు అంతర్గత విలువకు తక్కువగా ఉన్నప్పుడు దాన్ని కొనుగోలు చేయడమే అర్థవంతం అవుతుంది. 

 

ఏ ధరలో?
షేరు తిరిగి కొనుగోలు ధర, ఆ కంపెనీలో మిగిలి ఉండే వాటాలకు విలువను తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. షేరు అంతర్గత విలువకు చాలా తక్కువగా ఉన్నప్పుడే బైబ్యాక్‌ చేయడమే లాజిక్‌ అని వారెన్‌ బఫెట్‌ సూత్రీకరణ. కానీ గత ఐదేళ్ల కాలంలో 90 శాతం షేరు బైబ్యాక్‌లు వాటాదారుల ప్రయోజనం కలిగించేవి కావని, సిల్లీ ధరలో వాటిని చేపట్టినవిగా వారెన్‌ బఫెట్‌ 2009 నాటి బెర్క్‌షైర్‌ వార్షిక సమావేశంలో పేర్కొన్నారు. బెర్క్‌షైర్‌ నాలుగు దశాబ్దాల చరిత్రలో ప్రప్రథమంగా 2011లో షేర్ల బైబ్యాక్‌కు బఫెట్‌ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవ విలువకు చాలా తక్కువగా ఉన్నందున బుక్‌ విలువపై 120 శాతం వరకు ఆఫర్‌ చేశారు.



You may be interested

స్వల్ప కరెక్షన్‌ కొనుగోలుకు అవకాశం...

Monday 8th April 2019

నిఫ్టీ సానుకూల స్థాయిల్లో ఉందని, చిన్న కరెక్షన్‌లు వస్తే కొనుగోళ్లకు అవకాశంగా చూడాలని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌ షెట్టి పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థతో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. నిఫ్టీ మద్దుతు స్థాయిల గురించి మాట్లాడుతూ... నిఫ్టీ స్వల్ప కాల ట్రెండ్‌ సానుకూలంగా ఉందన్నారు. నిఫ్టీకి తక్షణ మద్దతు 11,500-11,550 స్థాయిల్లో ఉందని ఈ  స్థాయిల వరకు మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే

అమిత్‌షాకు షేర్లు.. రాహుల్‌కు ఎంఎఫ్‌లు..

Saturday 6th April 2019

ప్రధాన పార్టీల అధ్యక్షుల పెట్టుబడుల వివరాలు ఎన్నికల సందర్భంగా ప్రతి అభ్యర్ధి తన ఆస్తులు, పెట్టుబడుల వివరాలను బహిర్గతం చేయాల్సిఉంటుంది. ప్రస్తుతం హోరా హోరీగా తలపడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులిద్దరి ఆస్తుల అఫిడవిట్‌లో మార్కెట్‌ మదుపుకు సంబంధించి ఆసక్తికర అంశాలు తెలిశాయి. బీజేపీ ప్రెసిడెంట్‌ అమిత్‌ షాకు సొంతంగా షేర్లలో పెట్టుబడులు పెట్టడం మక్కువ కాగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రం మూ‍్యచువల్‌ ఫండ్స్‌ ద్వారా మాత్రమే మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు

Most from this category