STOCKS

News


చైనా మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌..

Saturday 20th October 2018
Markets_main1540018944.png-21317

శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన చైనా మార్కెట్ చివరకు లాభాల్లో ముగిసింది. 2.58 శాతం లేదా 64 పాయింట్ల పెరుగుదలతో 2,550 పాయింట్లకు బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. చైనా ఆర్థిక వృద్ధి తొమిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని గణాంకాలు పేర్కొనడంతో మార్కెట్లు పడిపోయాయి. అయితే చైనా టాప్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్లు.. చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై, స్టాక్‌ మార్కెట్‌పై విశ్వాసంతో ఉన్నామని పేర్కొనడం సానుకూల ప్రభావం చూపింది. కాగా చైనా స్టాక్‌ మార్కెట్‌ జనవరి నాటి గరిష్ట స్థాయి నుంచి చూస్తే 30 శాతంమేర పతనమైంది. వారం మొత్తంగా చూస్తే చైనా షాంఘై కంపొజిట్‌ 2.2 శాతంమేర పతనమైంది. ఇండెక్స్‌ రెండు వారాలుగా క్షీణిస్తూ వస్తోంది.
మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..
ఆసియా స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 126 పాయింట్ల నష్టంతో 22,532 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 7 పాయింట్ల నష్టంతో 3,062 పాయింట్ల వద్ద ముగిసింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 34 పాయిం‍ట్ల నష్టంతో 9,919 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 64 పాయింట్ల లాభంతో 2,550 పాయింట్లకు పెరిగింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 8 పాయింట్ల లాభంతో 2,156 పాయింట్ల వద్ద చేరింది. హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 107 పాయింట్ల లాభంతో 25,561 పాయింట్లకు ఎగసింది. 
 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు..

Saturday 20th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 52 పాయింట్ల నష్టంతో 10,273 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,303 పాయింట్లతో పోలిస్తే 30 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ

మిశ్రమంగా అమెరికా మార్కెట్‌

Saturday 20th October 2018

అమెరికా మార్కెట్‌ శుక్రవారం దాదాపుగా నష్టాల్లోనే ముగిసింది. ఇండెక్స్‌లు ప్రారంభ లాభాలను చివరి వరకు నిలుపుకోలేకపోయాయి. డౌజోన్స్‌ లాభాల్లో ముగిస్తే.. మిగతా రెండు ప్రధాన ఇండెక్స్‌లు నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.3 శాతం లేదా 65 పాయిం‍ట్ల లాభంతో 25,444 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ షేరు 8.8 శాతం పెరగడం సానుకూల ప్రభావం చూపింది. 2008 అక్టోబర్‌ 28 నుంచి చూస్తే ఈ

Most from this category