STOCKS

News


బ్యాంక్‌ షేర్లకు ‘‘శక్తి’’

Wednesday 12th December 2018
Markets_main1544594045.png-22859

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త ఛైర్మన్‌గా శక్తికాంత్‌ నియామకం బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ఉత్సాహానిచ్చింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకు ఇండెక్స్‌లు బుధవారం 1.50శాతం లాభపడ్డాయి. యస్‌బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ 4శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 3శాతం పెరిగాయి. సౌతిండియా, కోటక్‌ బ్యాంక్ షేర్లు 2శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. అలాగే మొండిబాకీల ప్రక్షాళనకు సంబంధించి సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలవుతున్న 11 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు సైతం నేడు లాభాల బాట పట్టాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, విజయా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఓరియంటల్ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌, యూనిటైడ్‌ బ్యాంక్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌ షేర్లు 6 నుంచి 4శాతం ర్యాలీ చేశాయి. వాటితో పాటు సెంట్రల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌ షేర్లు 3నుంచి 1శాతం లాభపడ్డాయి. మరోవైపు ఇటీవలకాలంలో ద్రవ్య లభ్యత కొరత సంక్షోభాన్ని ఎదుర్కోంటున్న నాన్‌ బ్యాంకింగ్‌ షేర్లు శక్తికాంత్‌ నియామకానికి సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ రంగంలో ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 2శాతం లాభపడ్డాయి.



You may be interested

జియోకి 2 అనుబంధ కంపెనీలు!!

Wednesday 12th December 2018

టెలికం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన ఫైబర్‌, టవర్‌ ఆస్తులను విడగొట్టి వేర్వేరు కంపెనీలుగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటి పేర్లు తెలియాల్సి ఉంది. రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ బోర్డు కూడా ఫైబర్‌, టవర్ల ఆస్తులను విడగొట్టడానికి తాజాగా అంగీకారం తెలిపింది. మంగళవారం జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్లు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జియో తెలియజేసింది. కాగా వేర్వేరు కంపెనీల ఏర్పాటు సంబంధిత విభాగాల రెగ్యులేటరీల

రూపాయికి జంట దెబ్బలు!

Wednesday 12th December 2018

నీరుకారుతున్న రికవరీ ఆశలు ఈ ఏడాది ఆసియాలో అత్యంత అధ్వాన్న కరెన్సీగా పేరు మూటగట్టుకొన్న రూపాయి కష్టాలు మళ్లీ మొదలయినట్లున్నాయి. ఇటీవల కాలంలో కాస్త రికవరీ చూపుతున్న రూపాయి తాజాగా మరోమారు పతనం దిశగా పరుగులు పెడుతోంది. దీంతో రూపీ రికవరీ ఆశలను బుల్స్‌ వదులకోకతప్పదని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా జరిగిన రెండు సంఘటనలు రూపాయికి జంట కష్టాలు తెచ్చాయని విశ్లేషిస్తున్నారు. ఒకపక్క అధికార బీజేపీ మూడు ప్రధార రాష్ట్రాల్లో ఓడిపోవడం,

Most from this category