STOCKS

News


స్వల్పంగా పెరిగిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 4th January 2019
Markets_main1546571373.png-23392

గత రాత్రి అమెరికా సూచీలు భారీ పతనాన్ని చవిచూసినప్పటికీ, శుక్రవారం జపాన్‌ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పంగా పెరిగింది. ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్స్‌కు అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40 గంటలకు 11 పాయింట్ల పెరుగుదలతో 10,730 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,719 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగిస్తుందన్న భయాలు, యాపిల్‌ ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించడం వంటి అంశాలతో గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 2.7 శాతం వరకూ పడిపోయాయి.  కాగా మూడు రోజుల నుంచి సెలవుల్లో వున్న జపాన్‌ నికాయ్‌ సూచి శుక్రవారం ఒక్కసారిగా 3 శాతంపైగా పతనమయ్యింది. గత రెండు రోజులుగా క్షీణతను నమోదుచేసిన ఇతర ఆసియా మార్కెట్లయిన హాంకాంగ్‌, చైనా, సింగపూర్‌, కొరియా సూచీలు ఈ ఉదయం స్వల్ప పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

బ్యాంకింగ్‌ ఏడీఆర్‌లు డౌన్‌

Friday 4th January 2019

అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌ కంపెనీల ఏడీఆర్‌లు (అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్స్‌) గత రాత్రి 1-5 శాతం మధ్య నష్టాల్ని చవిచూసాయి. బ్యాంకింగ్‌ ఏడీఆర్‌లు ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.7 శాతం మేర క్షీణించి 10.15 డాలర్ల వద్ద క్లోజ్‌కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.8 శాతం క్షీణతతో 101.9 డాలర్ల వద్ద క్లోజయ్యింది. టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.7 శాతం వరకూ నష్టపోయి 9.47 డాలర్ల వద్ద ముగిసింది. మరో

ఆటుపోట్లను మర్చిపోండి... 2019లో భారీ లాభాలే?

Friday 4th January 2019

ఈ ఏడాది మంచి లాభాలకు అవకాశం ఉందని వారెన్‌ బఫెట్‌ సూచిక తెలియజేస్తోంది. చమురు ధరలు దిగిరావడం, రూపాయి పతనం ఆగడం, కమోడిటీ ధరలు పతనం కావడం వంటి సానుకూల అంశాలు ఎన్నో ఉన్నాయి. అయితే, అంతర్జాతీయంగా చైనా వృద్ధి మందగమనం, దేశీయంగా ఎన్నికలు సహా పలు అంశాల కారణంగా ఈ ఏడాది మన మార్కెట్లలో అస్థిరతలు ఎక్కువగా ఉంటాయన్న అంచనాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో మంచి వృద్ధి

Most from this category