STOCKS

News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Wednesday 24th October 2018
Markets_main1540351521.png-21411

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో ఏకంగా 97 పాయింట్ల లాభంతో 10,269 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,147 పాయింట్లతో పోలిస్తే 122 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లోనే ముగిశాయి. 

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. 
అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నికాయ్‌, తైవాన్‌, షాంఘై మినహా మిగతావన్నీ లాభాల్లో ఉన్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 27 పాయింట్ల నష్టంతో 21,983 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 8 పాయింట్ల లాభంతో 3,039 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 68 పాయిం‍ట్ల నష్టంతో 9,706 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 4 పాయింట్ల నష్టంతో 2,590 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 2 పాయింట్ల లాభంతో 2,108పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 160 పాయింట్ల లాభంతో 25,506 పాయింట్ల వద్ద ఉన్నాయి.  

అమెరికా మార్కెట్లు డౌన్‌..
అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.5 శాతం లేదా 126 పాయిం‍ట్ల నష్టంతో 25,191 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.55 శాతం లేదా 15 పాయింట్ల నష్టంతో 2,740 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.42 శాతం లేదా 31 పాయింట్ల నష్టంతో 7,437 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటీవలి అమ్మకాల ఒత్తిడికి ఎర్నింగ్స్‌ అంచనాలపై ఏర్పడ్డ ఆందోళనలు ప్రతికూల ప్రభావం చూపాయి. అమెరికా మధ్యంతర ఎన్నికలు, ఇటలీ బడ్జెట్‌, ప్రాఫిట్‌ వృద్ధి ఆందోళనలు కూడా ఇన్వెస్టెర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. 



You may be interested

మార్కెట్‌ ఎటు వైపు?

Wednesday 24th October 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ► అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నికాయ్‌, తైవాన్‌, షాంఘై మినహా మిగతావన్నీ లాభాల్లో ఉన్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 27 పాయింట్ల నష్టంతో 21,983 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 8 పాయింట్ల లాభంతో 3,039 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 68 పాయిం‍ట్ల నష్టంతో 9,706 పాయింట్ల

ఇప్పుడు ఈ 3 రంగాలు బెటర్‌..

Tuesday 23rd October 2018

యుటిలిటీస్‌, ఫార్మా, మెటల్‌ రంగ షేర్లలో వ్యాల్యుకు అవకాశముందని ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కో-సీఐవో మహేశ్‌ పాటిల్‌ తెలిపారు. ఎర్నింగ్స్‌ వృద్ధి తక్కువగా ఉన్నా కూడా.. ఇవి ట్రాక్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే కొన్ని నాణ్యమైన ఎన్‌బీఎఫ్‌సీలు కూడా చౌక ధరకే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మార్కెట్‌లో మరో విడత అమ్మకాలు

Most from this category