STOCKS

News


నిఫ్టీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌!!

Thursday 29th November 2018
Markets_main1543462323.png-22461

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 96 పాయింట్ల లాభంతో 10,811 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,717 పాయింట్లతో పోలిస్తే 94 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి.  

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. 
ఒక్క హాంగ్‌ సెంగ్‌ మినహా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 27 పాయింట్ల లాభంతో 3,121 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 52 పాయింట్ల లాభం 9,936 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 3 పాయింట్ల లాభంతో 2,604 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 12 పాయింట్ల లాభంతో 2,120 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 59 పాయింట్ల నష్టంతో 26,623 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 201 పాయింట్ల లాభంతో 22,378 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

భారీ లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు 
అమెరికా మార్కెట్లు బుధవారం బాగా లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.5 శాతం లేదా 617 పాయిం‍ట్ల లాభంతో 25,366 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 2.3 శాతం లేదా 62 పాయింట్ల లాభంతో 2,743 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.95 శాతం లేదా 209 పాయింట్ల లాభంతో 7,291 పాయింట్ల వద్ద ముగిసింది. ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. ప్రస్తుతం వడ్డీ రేట్లు తటస్థ స్థాయికి దగ్గరిలో ఉన్నాయని తెలిపారు. దీని వల్ల భవిష్యత్‌లో రేట్ల పెంపులో వేగం ఉండకపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లు లాభాలతో దూసుకెళ్లాయి.  



You may be interested

మార్కెట్‌ పెరుగుతుందా?

Thursday 29th November 2018

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 96 పాయింట్ల లాభంతో 10,811 పాయింట్ల వద్ద ఉంది.  ♦ భారత్‌ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 7.6 శాతానికి తగ్గొచ్చని యాక్సిస్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. ఇండస్ట్రీయల్‌ యాక్టివిటీ నెమ్మదించడం ఇందుకు కారణమని తెలిపింది. జూన్‌ క్వార్టర్‌లో వృద్ధి రేటు 8.2 శాతంగా

ఇప్పటికైతే ఈటీఎఫ్‌లు నయం: ధీరేంద్ర కుమార్‌

Thursday 29th November 2018

కొన్ని రకాల ఫండ్స్‌ ప్రాధాన్యం కోల్పోయాయని, ఇవి బెంచ్‌ మార్క్‌తో పోటీ పడలేకపోతున్నాయని వ్యాల్యూ రీసెర్చ్‌ సం‍స్థ సీఈవో ధీరేంద్ర కుమార్‌ అన్నారు. ఈ ఫండ్స్‌ వ్యయాలు అధిక స్థాయిల్లో ఉండడమే కారణమన్నారు. వీటికంటే ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు) మెరుగైనవన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడుల్లో వచ్చిన మార్పులపై ఆయన ఓ వార్తా సంస్థతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ సిప్‌ రాబడులను

Most from this category