STOCKS

News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 30th November 2018
Markets_main1543548502.png-22497

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 32 పాయింట్ల లాభంతో 10,947 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,855 పాయింట్లతో పోలిస్తే 92 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా మిశ్రమంగానే ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి.  

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. 
కొస్పి, నికాయ్‌ మినహా మిగతా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 13 పాయింట్ల లాభంతో 3,122 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 49 పాయింట్ల లాభంతో 9,934 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 11 పాయింట్ల లాభంతో 2,578 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 6 పాయింట్ల నష్టంతో 2,108 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 192 పాయింట్ల లాభంతో 26,642 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 1 పాయింటు నష్టంతో 22,261 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు 
అమెరికా మార్కెట్లు గురువారం నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.11 శాతం లేదా 28 పాయిం‍ట్ల నష్టంతో 25,338 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.22 శాతం లేదా 6 పాయింట్ల నష్టంతో 2,737 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.25 శాతం లేదా 19 పాయింట్ల నష్టంతో 7,273 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ షేర్లు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Friday 30th November 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే...  ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 32 పాయింట్ల లాభంతో 10,947 పాయింట్ల వద్ద ఉంది.  ♦ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7-7.4 శాతం శ్రేణిలో వృద్ధి చెందొచ్చని ఎన్‌సీఏఈఆర్‌ అంచనా వేసింది.  ♦ ఇండియన్‌ రూపాయి నవంబర్‌ 29న 77 పైసలు బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 69.85 వద్ద

ఎఫ్‌పీఐలు భారీగా కొనుగోలు చేసిన షేర్లు

Friday 30th November 2018

ఎఫ్‌పీఐలు గత రెండు నెలల్లో మన ఈక్విటీ మార్కెట్లలో రూ.30,000 కోట్లకు పైగా అమ్మేశారు. అయితే, దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు నికర కొనుగోలు దారులుగా ఉండడంతో స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోకుండా ఆదుకున్నట్టయింది. ముఖ్యంగా ఎఫ్‌పీఐలు సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికరంగా రూ.10,200 కోట్ల విలువైన అమ్మకాలు జరిపారు. ఆటోమొబైల్స్‌, ఐటీ, మెటల్స్‌, మైనింగ్‌ రంగాల్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు ఎక్కువగా చోటు చేసుకున్నట్టు కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. సెప్టెంబర్‌

Most from this category