STOCKS

News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Saturday 17th November 2018
Markets_main1542428471.png-22109

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి లాభాల్లో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 81 పాయింట్ల లాభంతో 10,779 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,687 పాయింట్లతో పోలిస్తే 92 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం మిశ్రమంగానే క్లోజయ్యాయి. కాగా వ్యాల్యూబయ్యింగ్‌ కారణంగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారంలో లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 197 పాయింట్లు పెరిగి 35,457 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 10,682 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలకు ఇది నెల గరిష్ట స్థాయి.  ఇక వారం పరంగా చూస్తే సెన్సెక్స్‌ 299 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు చొప్పున పెరిగాయి.   



You may be interested

డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ అప్‌.. నాస్‌డాక్‌ డౌన్‌..

Saturday 17th November 2018

అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.49 శాతం లేదా 123 పాయిం‍ట్ల లాభంతో 25,413 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.22 శాతం లేదా 6 పాయింట్ల లాభంతో 2,736 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.15 శాతం లేదా 11 పాయింట్ల నష్టంతో 7,247 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌విడియా షేరు దాదాపు 19 శాతం మేర పతనం

స్మాల్‌ క్యాప్స్‌లో జెమ్స్‌ కోసం చూస్తున్నారా..?

Saturday 17th November 2018

ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ పతనంతో మంచి షేర్లు కూడా ఆకర్షణీయమైన ధరల స్థాయికి వచ్చేశాయి. దీంతో పెట్టుబడి పెట్టేందుకు సరైన స్టాక్స్‌ ఏవంటూ కొందరు అన్వేషించే పనిలో పడ్డారు. సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాలు మంచి స్టాక్స్‌ ఎంపికకు ఆధారంగా ఉపయోగపడతాయి. మొత్తం మీద ఎక్కువ కంపెనీల ఫలితాలు మెప్పించే విధంగా లేవు. అయితే, మంచి ఫలితాలను ప్రకటించిన కంపెనీలు కూడా ఉన్నాయి. వీటిని

Most from this category