STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌..

Thursday 8th November 2018
Markets_main1541649202.png-21780

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 9:16 సమయంలో 8 పాయింట్ల లాభంతో 10,683 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,614 పాయింట్లతో పోలిస్తే 69 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకుండా, ఇదే ట్రెండ్‌ కొనసాగితే నిఫ్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు బుధవారం ర్యాలీ చేశాయి.



You may be interested

అమెరికా మార్కెట్ల ర్యాలీ

Thursday 8th November 2018

మధ్యంతర ఎన్నికల ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే వెలువడటంతో అమెరికా మార్కెట్లు బుధవారం ర్యాలీ చేశాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరును కొనసాగించేందుకు పాలసీ రూపకల్పనలో డెమోక్రాట్స్‌తో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంకేతాలివ్వడం సానుకూల ప్రభావం చూపింది. ప్రధాన ఇండెక్స్‌లు 2 శాతానిపైగా ఎగశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.13 శాతం లేదా 545 పాయిం‍ట్ల లాభంతో 26,180 పాయింట్ల వద్ద ముగిసింది. యునైటెడ్‌ హెల్త్‌కేర్‌, యాపిల్‌

ఆసియా మార్కెట్లు రయ్‌.. రయ్‌..

Thursday 8th November 2018

అమెరికా మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు గురువారం జోరు మీదున్నాయి. ప్రధాన సూచీలన్నీ లాభాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 27 పాయింట్ల లాభంతో 3,092 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 57 పాయిం‍ట్ల లాభంతో 9,965 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 13 పాయింట్ల లాభంతో 2,654 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 31 పాయింట్ల లాభంతో

Most from this category