News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 12th September 2018
Markets_main1536723644.png-20174

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 9:03 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 8 పాయింట్ల లాభంతో 11,329 పాయింట్ల వద్ద ఉంది. దీంతో నిప్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి.  

ఆసియా మార్కెట్లు నష్టాల్లో..
ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 93 పాయింట్ల నష్టంతో 22,571 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 6 పాయింట్ల నష్టంతో 2,277 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 118 పాయింట్ల నష్టంతో 26,304 పాయింట్ల వద్ద,  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 1 పాయింటు నష్టంతో 3,109 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 9 పాయింట్ల నష్టంతో 2,656 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 36 పాయిం‍ట్ల నష్టంతో 10,716 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.   

లాభాల్లో అమెరికా మార్కెట్లు..
అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 114 పాయిం‍ట్ల లాభంతో 25,971 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 11 పాయింట్ల లాభంతో 2,887 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 48 పాయింట్ల లాభంతో 7,972 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. యాపిల్‌ షేర్లు 2 శాతానికిపైగా పెరగడం సానుకూల ప్రభావం చూపింది. 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Wednesday 12th September 2018

మంగళవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన నిఫ్టీ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది.  నష్టాల్లోకి జారిపోయింది. 11,300 మార్క్‌కు దిగువకు వచ్చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్టానికి పతనం కావడం, వాణిజ్య ఉద్రిక్తతలు ప్రతికూల ప్రభావం చూపాయి.  ఇండెక్స్‌ తన డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్‌లో పెద్ద బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇది బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ రకపు ప్యాట్రన్‌ మాదిరి కనిపిస్తోంది. 11,476 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 11,479 పాయింట్లను

రూపాయి, మార్కెట్ల పతనం... ఏంటి కర్తవ్యం?

Wednesday 12th September 2018

రూపాయి విలువ అంతకంతకూ దిగజారిపోతుండడం, దేశీయ స్టాక్‌ మార్కెట్లను కుదేలు చేస్తోంది. ఈ సమయంలో అంత రిస్క్‌ భరించలేని ఇన్వెస్టర్లు ఎఫ్‌ఎంసీజీ, డ్యూరబుల్స్‌, ఆటోమొబైల్‌, ఫైనాన్షియల్స్‌, రిటైల్‌ ప్రైవేటు బ్యాంకులను పరిశీలించొచ్చని ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్స్‌ బిజినెస్‌ హెడ్‌, సీఐవో ప్రతీక్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. తాము సైతం ఇన్వెస్ట్‌మెంట్‌లో సంప్రదాయవాదులమేనంటూ, పెట్టుబడుల విషయంలో ఈ రంగాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.    రూపాయి స్థిరపడాలి రూపాయి స్థిరపడిన తర్వాతే పరిస్థితులు కుదుటపడతాయని భావిస్తున్నట్టు ప్రతీక్‌ అగర్వాల్‌

Most from this category