STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Monday 1st October 2018
Markets_main1538364466.png-20722

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 7 పాయింట్ల లాభంతో 10,966 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,954 పాయింట్లతో పోలిస్తే 12 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. 

లాభాల్లో ఆసియా సూచీలు
ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 143 పాయింట్ల లాభంతో 24,263 పాయింట్ల వద్ద ఉంది. హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ మార్కెట్‌కు సెలవు. ఇది శుక్రవారం 73 పాయింట్ల లాభంతో 27,788 పాయింట్లకు పెరిగింది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 4 పాయింట్ల లాభంతో 3,261 పాయింట్లకు ఎగసింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 32 పాయిం‍ట్ల లాభంతో 11,038 పాయింట్ల వద్ద ఉంది. చైనా మార్కెట్‌కు సెలవు. శుక్రవారం చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 30 పాయింట్ల లాభంతో 2,821 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల నష్టంతో 2,338 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 

అమెరికా మార్కెట్లు మిశ్రమం..
అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 స్వల్పంగా నష్టపోతే.. డౌజోన్స్‌, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 18 పాయిం‍ట్ల లాభంతో 26,458 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. కేవలం 0.02 పాయింటు అతిస్వల్ప నష్టంతో 2,914 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 4 పాయింట్ల లాభంతో 8,046 పాయింట్ల వద్ద ముగిసింది. వాణిజ్య ఉద్రిక్తత భయాలు మార్కెట్‌ లాభాలను పరిమితం చేశాయి. అమెరికా, కెనడా దేశాలు వాణిజ్య భాగస్వామ్యానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఒప్పందానికి రాలేదు. గడువు దగ్గరపడ్డా కూడా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. 



You may be interested

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Monday 1st October 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 స్వల్పంగా నష్టపోతే.. డౌజోన్స్‌, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 18 పాయిం‍ట్ల లాభంతో 26,458 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. కేవలం 0.02 పాయింటు అతిస్వల్ప నష్టంతో 2,914 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 4 పాయింట్ల లాభంతో 8,046 పాయింట్ల వద్ద ముగిసింది. వాణిజ్య ఉద్రిక్తత

దీర్ఘకాలానికి మూడు స్టాక్స్‌

Sunday 30th September 2018

సెప్టెంబర్‌ మాసం స్టాక్‌ మార్కెట్లను నష్టాల్లో నడిపించింది. నిఫ్టీ 12,000 దాటేస్తుందన్న అంచనాలతో కొందరు అనలిస్టులు, ఇన్వెస్టర్లు ఉండగా, మార్కెట్లు ఉన్నట్టుండి రివర్స్‌గేర్‌ పట్టాయి.  కేవలం ఒక్క నెలలోనే ఇన్వెస్టర్లు రూ.15 లక్షల కోట్ల పెట్టుబడుల విలువను కోల్పోయారు. నిఫ్టీ 7 శాతం పడిపోయింది. ఈ ఏడాది జనవరి గరిష్టాల నుంచి చూస్తే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 19.5 శాతం, స్మాల్‌క్యాప్‌ 28.5 శాతం నష్టపోయాయి. చాలా స్టాక్స్‌ వాటి సరసమైన

Most from this category