STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 61 పాయింట్లు అప్‌

Wednesday 6th February 2019
Markets_main1549423341.png-24032

క్రితం రోజు యూరప్‌, అమెరికా సూచీలు ర్యాలీ సాగించడం, తాజాగా జపాన్‌ సూచీ పెరిగిన నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 61 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మంగళవారం ఉదయం 8.45  గంటలకు 11,012  పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,951 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం  ఫెడ్‌ నిర్ణయం వెలువడిన తర్వాత క్రమేపీ ప్రపంచ మార్కెట్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రధాన షేర్లు భాగంగా కలిగిన ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌ రెండు నెలల గరిష్టస్థాయికి చేరింది. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీల్లో నాస్‌డాక్‌ 1 శాతం వరకూ పెరగ్గా, డోజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ-500 సూచీలు అరశాతం లాభంతో ముగిసాయి. . తాజాగా జపాన్‌ సూచీ అరశాతం లాభాల్లో ట్రేడవుతుండగా, హాంకాంగ్‌, చైనా, సింగపూర్‌, తైవాన్‌, కొరియా మార్కెట్లకు లూనార్‌ న్యూఇయర్‌ సెలవులు. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 6th February 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మయ్యే షేర్ల వివ‌రాలు లుపిన్:-  అమెరికా మార్కెట్లోకి  క్లోమిపారైన్ హైడ్రోక్లోరైడ్ జ‌న‌రిక్  ఔష‌ధాల‌ను విడుద‌ల చేసింది. సంబంధిత  ఔష‌ధాల‌ను అతి శుభ్రత వ్యాధి(ఓసీడీ) నివార‌ణ చికిత్సలో వినియోగిస్తారు. యాక్సిస్ బ్యాంక్‌:- కార్పోరేట్ చ‌ట్టాల‌ నియ‌మాళిని ఉల్లంఘించినందుకు ఆర్‌బీఐ రూ.కోటిల జ‌రిమానా విధించింది. డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- జ‌న‌రిక్ ఔష‌దం సుబాక్సోన్ కేసులో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు అమెరికా కోర్టు ఆఫ్ అప్పీల్స్‌లో ఊర‌ట ల‌భించింది. ఎన్‌బీసీసీ:- వివిధ వ్యాపార విభాగాల

స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌తో జాగ్రత్త!

Tuesday 5th February 2019

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రభావం మార్కెట్లపై ఎక్కువే ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో... స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌, ప్రభుత్వం వల్ల సులభంగా ప్రభావానికి లోనయ్యే వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మాథ్యూస్‌ ఇండియా ఫండ్‌ కో మేనేజర్‌ పీయూష్‌ మిట్టల్‌ సూచించారు. శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఈ ఫండ్‌ నడుస్తోంది.    ‘‘భారత మార్కెట్లో ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నవి లార్జ్‌క్యాప్‌ స్టాక్సే. వీటి వ్యాల్యూషన్లు చారిత్రక సగటు స్థాయిల్లోనే ఉన్నాయి. భవిష్యత్తు వృద్ధిని ఇవి చేరుకోగలన్న

Most from this category