STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పైకి..

Saturday 27th October 2018
Markets_main1540617410.png-21527

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి లాభాల్లో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 68 పాయింట్ల లాభంతో 10,115 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,054 పాయింట్లతో పోలిస్తే 61 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా నెగటివ్‌గానే క్లోజయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు పడిపోవడం మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపనుంది.  
కాగా అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్యపై ఆందోళనల కారణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. రూపాయి పతనం కొనసాగుతుండటం, మారుతీ సుజుకీ, యస్‌ బ్యాంక్‌, ఇతర కంపెనీల క్యూ2 ఫలితాలు నిరాశపరచడంతో అమ్మకాలు వెల్లువెత్తాయని నిపుణులు పేర్కొన్నారు. నవంబర్‌ సిరీస్‌ భారీ నష్టాలతో ఆరంభమైంది. ముడి చమురు ధరలు దిగొచ్చినా, అది మార్కెట్‌పై ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 341 పాయింట్లు పతనమై 33,349 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 95 పాయింట్లు క్షీణించి 10,030 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలకు ఇది ఏడు నెలల కనిష్ట స్థాయి. అన్ని రంగాల షేర్లు క్షీణించాయి. బ్యాంక్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, లోహ, ఫార్మా షేర్లు బలహీనంగా ట్రేడయ్యాయి.  ఇక వారం పరంగా చూస్తే, వరుసగా రెండో వారమూ స్టాక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 966 పాయింట్లు(3 శాతం), నిఫ్టీ 274 పాయింట్లు (2.7 శాతం) చొప్పున క్షీణించాయి. 



You may be interested

ఆసియా మార్కెట్లు డౌన్‌..

Saturday 27th October 2018

ఆసియా స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 84 పాయింట్ల నష్టంతో 21,184 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 41 పాయింట్ల నష్టంతో 2,972 పాయింట్ల వద్ద ముగిసింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 32 పాయిం‍ట్ల నష్టంతో 9,489 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 5 పాయింట్ల నష్టంతో 2,598 పాయింట్లకు తగ్గింది. దక్షిణ కొరియా

ఆఫ్‌షోర్‌లో రూపీ అప్‌

Saturday 27th October 2018

ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం రాత్రి బలపడింది. 73.17 స్థాయికి లాభపడింది. ఒకానొక సమయంలో 73.08 స్థాయికి కూడా పెరిగింది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే సోమవారం రూపాయి పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా రూపాయి శుక్రవారం ఇండియన్‌ మార్కెట్‌లో 20 పైసలు క్షీణించి 73.47 వద్ద ముగిసింది. డాలర్‌ బలపడటం, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు తరలి వెళ్లిపోవడం వంటి అంశాలు

Most from this category