STOCKS

News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Monday 19th November 2018
Markets_main1542598187.png-22155

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:53 సమయంలో 49 పాయింట్ల లాభంతో 10,747 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,687 పాయింట్లతో పోలిస్తే 60 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు శుక్రవారం దాదాపు లాభాల్లోనే ముగిశాయి.  

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. 
సింగపూర్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌, తైవాన్‌ ఇండెక్స్‌ మినహా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 20 పాయింట్ల నష్టంతో 3,063 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 6 పాయింట్ల నష్టంతో 9,790 పాయింట్ల వద్ద ఉన్నాయి. ఇక చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 5 పాయింట్ల లాభంతో 2,683 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 2 పాయింట్ల లాభంతో 2,094 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 60 పాయింట్ల లాభంతో 26,243 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 75 పాయింట్ల లాభంతో 21,755 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.
 
డౌజోన్స్‌ 123 పాయింట్లు అప్‌
అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.49 శాతం లేదా 123 పాయిం‍ట్ల లాభంతో 25,413 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.22 శాతం లేదా 6 పాయింట్ల లాభంతో 2,736 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.15 శాతం లేదా 11 పాయింట్ల నష్టంతో 7,247 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌విడియా షేరు దాదాపు 19 శాతం మేర పతనం కావడం నాస్‌డాక్‌పై తీవ్ర ప్రభావం చూపింది. 2019 క్యూ3లో కంపెనీ ఆదాయం, గైడెన్స్‌ నిరుత్సాహపరచడం ఇందుకు కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనాతో వాణిజ్య పరమైన డీల్‌ కుదరచ్చని ఆశాభావం వ్యక్తంచేయడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. 
 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Monday 19th November 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:53 సమయంలో 49 పాయింట్ల లాభంతో 10,747 పాయింట్ల వద్ద ఉంది.  ♦ కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం సోమవారం జరగనుంది. ఇందులో ఇరుపక్షాలు ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం కనుగొనేందుకే ప్రాధాన్యం ఇవ్వనున్నప్పటికీ.. భేటీ కొంత వాడి, వేడిగా

పడ్డవన్నీ మంచివి కావు!

Sunday 18th November 2018

‘పడ్డోళ్లు ఎప్పుడూ చెడ్డోళ్లు కారు’ అన్నది జీవితానికి సరిపోతుందేమో కానీ... స్టాక్స్‌కు మాత్రం అతకదు. ఎందుకంటే పడిపోయిన స్టాక్స్‌ అన్నీ మంచివనీ చెప్పలేం. అలాగనీ చెడ్డవని అనడానికి కూడా లేదు. గత రెండేళ్ల కాలంలో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ భారీ ర్యాలీ చేశాయి. కానీ, ఈ ఏడాది మాత్రం తీవ్ర నష్టాల బాటలోకి వెళ్లాయి. అధిక వ్యాల్యూషన్ల కారణంగా వాటిల్లో దిద్దుబాటు జరిగింది. ఇక చమురు ధరలు, రూపాయి పతనం

Most from this category