STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌..

Wednesday 19th December 2018
Markets_main1545189552.png-23053

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:37 సమయంలో 39 పాయింట్ల లాభంతో 10,994 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,935 పాయింట్లతో పోలిస్తే 59 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. 

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. 
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 9 పాయింట్ల లాభంతో 3,055 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 31 పాయింట్ల లాభంతో 9,750 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 9 పాయింట్ల నష్టంతో 2,567 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 12 పాయింట్ల లాభంతో 2,074 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 1 పాయింటు నష్టంతో 25,813 పాయింట్ల వద్ద, జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225... 90 పాయింట్ల నష్టంతో 21,025 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

లాభాల్లో ముగిసిన అమెరికా
అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో క్లోజయ్యాయి. ఇండెక్స్‌లు స్వల్పంగా పెరిగాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.35 శాతం లేదా 83 పాయిం‍ట్ల లాభంతో 23,675 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.01 శాతం లేదా 0.22 పాయింటు లాభంతో 2,546 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.45 శాతం లేదా 30 పాయింట్ల లాభంతో 6,783 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ప్రభుత్వాన్ని పాక్షికంగా ముసివేయడానికి అవకాశముందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. మరో వైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల నిర్ణయం నేడు అర్ధ రాత్రి వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.  



You may be interested

స్టాక్‌ మార్కెట్‌పై వీటి ప్రభావం!!

Wednesday 19th December 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:37 సమయంలో 39 పాయింట్ల లాభంతో 10,994 పాయింట్ల వద్ద ఉంది.  ♦ ఇండియా వోలటాలిటీ ఇండెక్స్‌ (వీఐఎక్స్‌) 4.32 శాతం క్షీణతతో 14.50 స్థాయికి క్షీణించింది. వీఐఎక్స్‌ గత ఐదు సెషన్లలో 32 శాతం మేర పతనమైంది. ఇది మార్కెట్‌పై బుల్స్‌ ఆధిపత్యాన్ని సూచిస్తోంది.  ♦ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌

2019 బీజేపీ ఓడినా.. ట్రాక్‌లోనే మార్కెట్‌!!

Tuesday 18th December 2018

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా కూడా స్టాక్‌ మార్కెట్‌ ట్రాక్‌లోనే ఉంటుందని మార్కెట్‌ నిణుపుడు అంబరీష్‌ బాలిగా తెలిపారు. బుల్‌ మార్కెట్‌లో హోల్డింగ్‌ కంపెనీలు మంచి పనితీరు కనబరుస్తాయని, అందువల్ల వచ్చే 2 ఏళ్ల లక్ష్యంతో ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 2019 ప్రారంభంలో మార్కెట్‌ పేలవంగా ఉండొచ్చని అంచనా వేశారు. అయితే

Most from this category