STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌..

Friday 12th October 2018
Markets_main1539314618.png-21058

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:43 సమయంలో 56 పాయింట్ల లాభంతో 10,335 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,252 పాయింట్లతో పోలిస్తే 83 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 102 పాయింట్ల నష్టంతో 22,488 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 100 పాయింట్ల లాభంతో 25,365 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ కేవలం 0.18 పాయింటు నష్టంతో 3,047 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 48 పాయిం‍ట్ల లాభంతో 9,854 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 42 పాయింట్ల నష్టంతో 2,541 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 18 పాయింట్ల లాభంతో 2,147 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

నష్టాల్లో అమెరికా మార్కెట్‌
అమెరికా మార్కెట్‌ వరుసగా ఆరో సెషన్‌లోనూ గురువారం కూడా నష్టాల్లోనే ముగిసింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఆజ్యం పోసుకోవడం, వడ్డీ రేట్ల పెంపు భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆగస్ట్‌ 29 నుంచి నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 10.3 శాతంమేర క్షీణించింది.  ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ ఏకంగా ఏడాది కనిష్ట స్థాయికి పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 545 పాయిం‍ట్ల (2.13 శాతం) నష్టంతో 25,052 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 57 పాయింట్ల (2.06 శాతం) నష్టంతో 2,728 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 93 పాయింట్ల (1.25 శాతం) నష్టంతో 7,329 పాయింట్ల వద్ద ముగిసింది. 



You may be interested

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Friday 12th October 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ► అమెరికా మార్కెట్‌ వరుసగా ఆరో సెషన్‌లోనూ గురువారం కూడా నష్టాల్లోనే ముగిసింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఆజ్యం పోసుకోవడం, వడ్డీ రేట్ల పెంపు భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆగస్ట్‌ 29 నుంచి నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 10.3 శాతంమేర క్షీణించింది.  ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ ఏకంగా ఏడాది కనిష్ట స్థాయికి పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 545 పాయిం‍ట్ల

టాప్‌ పీఎంఎస్‌లకూ తప్పలేదు నష్టాలు

Friday 12th October 2018

పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సేవలు అందించే ప్రముఖ సంస్థలకు సైతం తాజా మార్కెట్‌ పతనం నష్టాలను మిగిల్చింది. సాధారణంగా మార్కెట్‌ కరెక్షన్లలో రిటైల్‌ ఇన్వెస్టర్లకు మాత్రమే నష్టాలు వస్తాయని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనం. అనుభవమున్న ఇన్వెస్టర్లు, పెట్టుబడి సంస్థలూ నష్టపోయిననట్టు గత నెలకు సంబంధించి సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి.    బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 6.25 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 12.54 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 16

Most from this category