STOCKS

News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Thursday 13th December 2018
Markets_main1544671482.png-22871

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 48 పాయింట్ల లాభంతో 10,836 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,783 పాయింట్లతో పోలిస్తే 53 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా బుధవారం లాభాల్లోనే ముగిశాయి.  

ఆసియా మార్కెట్లు రయ్‌.. 
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం లాభాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 9 పాయింట్ల లాభంతో 3,108 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 9,846 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 31 పాయింట్ల లాభంతో 2,633 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 20 పాయింట్ల లాభంతో 2,102 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 374 పాయింట్ల లాభంతో 26,561 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225 కూడా ఏకంగా 215 పాయింట్ల లాభంతో 21,818 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు
అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.64 శాతం లేదా 157 పాయిం‍ట్ల లాభంతో 24,527 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.54 శాతం లేదా 14 పాయింట్ల లాభంతో 2,651 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.95 శాతం లేదా 66 పాయింట్ల లాభంతో 7,098 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా- చైనా వాణిజ్య సంబంధాలపై సానుకూల అంచనాలు పాజిటివ్‌ ప్రభావం చూపాయి.



You may be interested

మార్కెట్‌ పెరుగుతుందా?

Thursday 13th December 2018

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ≈ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 48 పాయింట్ల లాభంతో 10,836 పాయింట్ల వద్ద ఉంది.  ≈ రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 2.3 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్‌లో ఇది 3.31 శాతంగా నమోదయ్యింది. గతేడాది నవంబర్‌లో 4.88 శాతంగా ఉంది.  ≈ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) అక్టోబర్‌లో 8.1 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్‌లో ఇది 4.5 శాతం.  ≈ ఇండియన్‌

డివిడెండ్‌ తారలు... ఈ షేర్లు

Thursday 13th December 2018

డివిడెండ్‌ అనేది ఈక్విటీ ఇన్వెస్టర్లకు అదనపు ఆదాయ వనరు. కొన్న తర్వాత స్టాక్‌ ధర పెరిగితే అది పెట్టుబడిపై లాభం. చాలా మంది దీనిపైనే దృష్టి పెడుతుంటారు. కానీ, స్టాక్స్‌పై వచ్చే డివిడెండ్‌ ఆదాయం గురించి పట్టించుకోరు. దీన్ని బోనస్‌ లాభంగా భావించాల్సి ఉంటుంది. తమ లాభాల నుంచి కంపెనీలు కొంత వాటాను షేరు వారీగా డివిడెండ్‌ రూపంలో పంచుతుంటాయి. కొన్ని కంపెనీలు అసలు డివిడెండ్‌ ఇవ్వడానికి కూడా ఆసక్తి

Most from this category