News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పైపైకి

Friday 28th September 2018
Markets_main1538104261.png-20652

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:28 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 51 పాయింట్ల లాభంతో 11,093 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,974 పాయింట్లతో పోలిస్తే 119 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ శుక్రవారం పాజిటివ్‌గా లేదా గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. 

మిశ్రమంగా ఆసియా సూచీలు..
ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 406 పాయింట్ల లాభంతో 24,202 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 2 పాయిం‍ట్ల స్వల్ప నష్టంతో 11,031 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 19 పాయింట్ల లాభంతో 3,255 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 17 పాయింట్ల లాభంతో 2,808 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 132 పాయింట్ల లాభంతో 27,847 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 9 పాయింట్ల నష్టంతో 2,346 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.    

లాభాల్లో అమెరికా మార్కెట్లు..
అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 55 పాయింట్ల (0.21 శాతం) లాభంతో 26,439 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 8 పాయింట్ల (0.28 శాతం) లాభంతో 2,914 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 52 పాయింట్ల (0.65 శాతం) లాభంతో 8,041 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు అమెరికా ఆర్థిక వ్యవస్థపై నమ్మకంతో ఉండటం సహా యాపిల్‌, అల్ఫాబెట్‌, ఫేస్‌బుక్‌ స్టాక్స్‌ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. ఎస్‌అండ్‌పీ 500 కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ 0.80 శాతంమేర ఎగసింది. ఇటీవలే ఇందులో కొన్ని మార్పులు చేసి, కొత్త పేరు పెట్టారు. ఇందులోనే ఫేస్‌బుక్‌, గూగుల్‌ పేరెంట్‌ అల్ఫాబెట్‌, ఇతర ఇంటర్నెట్‌ స్టాక్స్‌, మీడియా స్టాక్స్‌ ఉన్నాయి. 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Friday 28th September 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 55 పాయింట్ల (0.21 శాతం) లాభంతో 26,439 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 8 పాయింట్ల (0.28 శాతం) లాభంతో 2,914 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 52 పాయింట్ల (0.65 శాతం) లాభంతో 8,041 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు అమెరికా ఆర్థిక

కరెక్షన్‌తో చేతికి అందుతున్న ఫలాలు?

Friday 28th September 2018

మార్కెట్‌ ర్యాలీలో రోజురోజుకీ నూతన గరిష్ట స్థాయిలను నమోదు చేసిన కొన్ని స్టాక్స్‌, మార్కెట్‌ పతనంతో యూటర్న్‌ తీసుకున్నాయి. ర్యాలీలో కొందామన్నా పరుగులు తీస్తూ అందకుండా పోయిన స్టాక్స్‌ ఇప్పుడు కనిష్ట ధరలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాల ఇన్వెస్టర్లు మంచి విలువ కలిగిన స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లకు స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ విభాగంలో

Most from this category