STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Wednesday 3rd October 2018
Markets_main1538537035.png-20802

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:43 సమయంలో 49 పాయింట్ల లాభంతో 11,006 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 11,061 పాయింట్లతో పోలిస్తే 55 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా మంగళవారం మిశ్రమంగానే ముగిశాయి. 

మిశ్రమంగా ఆసియా సూచీలు
ఒక్క సింగపూర్‌ ఇండెక్స్‌ మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 13 పాయింట్ల నష్టంతో 24,257 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 4 పాయింట్ల నష్టంతో 27,122 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 18 పాయిం‍ట్ల నష్టంతో 10,902 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 29 పాయింట్ల నష్టంతో 2,309 పాయింట్ల వద్ద  ఉన్నాయి. ఇక సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 25 పాయింట్ల లాభంతో 3,268 పాయింట్ల వద్ద ఉంది. అయితే చైనా మార్కెట్‌కు సెలవు. శుక్రవారం చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 30 పాయింట్ల లాభంతో 2,821 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.   

డౌజోన్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డ్‌
అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు స్వల్పంగా నష్టపోతే.. డౌజోన్స్‌ ఇండెక్స్‌ లాభపడింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 123 పాయిం‍ట్ల లాభంతో 26,774 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఆల్‌టైమ్‌ గరిష్ట ముగింపు స్థాయి. ఇక ఎస్‌అండ్‌పీ 500.. కేవలం 1 పాయింటు అతిస్వల్ప నష్టంతో 2,923 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నాస్‌డాక్‌ కంపొసిట్‌ 38 పాయింట్ల నష్టంతో 8,000 పాయింట్ల వద్ద ముగిసింది. ఫేస్‌బుక్‌ స్టాక్‌ పడిపోవడం వల్ల నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఫేస్‌బుక్‌కు ఈ రెండు ఇండెక్స్‌లలో అధిక వెయిటేజీ ఉంది. 



You may be interested

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Wednesday 3rd October 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు స్వల్పంగా నష్టపోతే.. డౌజోన్స్‌ ఇండెక్స్‌ లాభపడింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 123 పాయిం‍ట్ల లాభంతో 26,774 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఆల్‌టైమ్‌ గరిష్ట ముగింపు స్థాయి. ఇక ఎస్‌అండ్‌పీ 500.. కేవలం 1 పాయింటు అతిస్వల్ప నష్టంతో 2,923 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నాస్‌డాక్‌ కంపొసిట్‌ 38 పాయింట్ల

అమ్మో! అక్టోబర్‌..

Tuesday 2nd October 2018

మహా పతనాలన్నీ ఈ నెల్లోనే  మరోమారు రిపీటవుతుందా? మార్కెట్లపై మార్క్‌ట్వయిన్‌ అద్భుతమైన కొటేషన్‌ తెలుసా.. ‘ స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్టర్లకు ప్రమాదకరమైన నెలల్లో అక్టోబర్‌ ఒకటి. మిగిలినవి.. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌, నవంబర్‌, డిసెంబర్‌.’ ..అంటే ఏడాదంతా ఇన్వెస్టర్లకు ప్రమాదమేనని ట్వయిన్‌ ఛలోక్తి.. కానీ నిజంగా కొందరు ఇన్వెస్టర్లు అక్టోబర్‌ అంటే గడగడా వణికిపోతారు. ఇది ఎంతవరకు కరెక్టో చూద్దాం.... స్టాక్‌ మార్కెట్లకు అక్టోబర్‌ నెల వచ్చిందంటే

Most from this category