STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 49 పాయింట్లు అప్‌

Monday 27th August 2018
Markets_main1535341055.png-19654

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం లాభలతో ట్రేడవుతోంది. ఉదయం 8:56 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 49 పాయింట్ల లాభంతో 11,623 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో శుక్రవారం నాటి ముగింపు 11,571 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. 

ఆసియా మార్కెట్లు లాభాల్లో..
ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 158 పాయింట్ల లాభంతో 22,759 పాయింట్ల వద్ద ఉంది. ఇక హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 512 పాయింట్ల లాభంతో 28,184 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 1 పాయింటు లాభంతో 2,294 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 56 పాయిం‍ట్ల లాభంతో 10,865 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 31 పాయింట్ల లాభంతో 2,760 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 19 పాయింట్ల లాభంతో 3,231 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

ఎస్‌అండ్‌పీ 500.. రికార్డ్‌ 
అమెరికా మార్కెట్లు జోరు మీదున్నాయి. మూడు ప్రధాన ఇండెక్స్‌లలో రెండు శుక్రవారం కొత్త గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. ఎస్‌అండ్‌పీ 500 ఎట్టకేలకు జీవిత కాల గరిష్ట స్థాయికి చేరింది. జనవరి 26 నాటి తన రికార్డ్‌ స్థాయిని అధిగమించడానికి ఇండెక్స్‌కు ఏడు నెలలు పట్టింది. మరోవైపు నాస్‌డాక్‌ ఇండెక్స్‌, స్మాల్‌ స్టాక్స్‌ రస్సెల్‌ 2000 ఇండెక్స్‌లు కూడా శుక్రవారం రికార్డ్‌ స్థాయిల వద్ద ముగిశాయి. డౌజోన్స్‌ మాత్రం తన జనవరి 26 నాటి రికార్డ్‌ స్థాయి కన్నా దిగువునే ఉంది. టెక్నాలజీ, మెటీరియల్స్‌ షేర్లు లాభపడటం వల్ల ఎస్‌అండ్‌పీ 500 శుక్రవారం 0.6 శాతం పెరుగుదలతో 2,874.69 పాయింట్ల వద్ద ముగిసింది. ఇండెక్స్‌కు ఇది జీవిత కాల గరిష్ట స్థాయి. ఎస్‌అండ్‌పీ 500 చివరిగా జవనరి 26న 2,872.87 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 67 పాయింట్ల లాభంతో 7,945 వద్ద ముగిసింది. దీంతో ఇండెక్స్‌ తన జూలై 25 నాటి 7932 పాయింట్ల గరిష్ట స్థాయిని అధిగమించింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 133 పాయింట్ల లాభంతో 25,790 వద్ద ముగిసింది. అయితే ఈ ఇండెక్స్‌ తన జనవరి 26 నాటి గరిష్ట స్థాయి కన్నా దిగువునే ఉంది. స్మాల్‌ స్టాక్స్‌ రస్సెల్‌ 2000 ఇండెక్స్‌ కూడా 1,726 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలో ముగిసింది. 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Monday 27th August 2018

నిప్టీ శుక్రవారం నష్టాల్లోనే ముగిసింది. డైలీ క్యాండిల్‌ స్టిక్‌ చార్ట్స్‌లో ఇన్‌డెసిసివ్‌ డోజి ప్యాట్రన్‌ను ఏర్పరచింది. వారంగా చూస్తే బుల్లిష్‌ క్యాండిల్‌ను  ఏర్పరచింది. నిఫ్టీ 50 శుక్రవారం 11,566 వద్ద​ప్రారంభమైంది. 11,604 పాయింట్లకు పెరిగింది. తర్వాత లాభాలు ఆవిరై 11,532 పాయింట్ల స్థాయికి క్షీణించింది. చివరకు 26 పాయింట్ల నష్టంతో 11,557 వద్ద క్లోజయ్యింది. వారంగా చూస్తే నిఫ్టీ 0.75 శాతం పెరిగింది.  వీఐఎక్స్‌ 3.35 శాతం క్షీణతతో 12.33 స్థాయికి తగ్గింది.

రూపాయి పతనంతో ఏ స్టాక్‌పై ఎటువంటి ప్రభావం?

Monday 27th August 2018

రూపాయి 70 దగ్గర్లో చలిస్తోంది. డాలర్‌తో ఇటీవలి కాలంలో రూపాయి బలహీనపడింది. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 9 శాతం విలువను కోల్పోయింది. టర్కిష్‌ లిరా 40 శాతం పతనం కావడం, చైనా, అమెరికా వాణిజ్య యుద్ధం, చమురు ధరలు ఇలా ఏ అంశాలైనా కారణం కావచ్చు... రూపాయి విలువ పతనం స్టాక్స్‌పై సానుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఏ స్టాక్‌పై

Most from this category