STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Friday 21st September 2018
Markets_main1537500048.png-20417

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:39 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 48 పాయింట్ల లాభంతో 11,359 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 11,273 పాయింట్లతో పోలిస్తే ఏకంగా 86 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క చైనా మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా గురువారం నష్టాల్లో ముగిశాయి. కాగా మొహర్రం సందర్భంగా గురువారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవు.

ఆసియా సూచీలు లాభాల్లో..
ఒక్క చైనా మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 118 పాయింట్ల లాభంతో 23,793 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 7 పాయింట్ల లాభంతో 2,330 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 177 పాయింట్ల లాభంతో 27,654 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 23 పాయింట్ల లాభంతో 3,203 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 73 పాయిం‍ట్ల లాభంతో 10,904 పాయింట్ల వద్ద ఉన్నాయి. ఇక చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 2,726 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

డౌజోన్స్‌ రికార్డ్‌..
అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌, ఎస్‌అండ్‌పీ 500 కొత్త గరిష్ట స్థాయిలో క్లోజయ్యాయి. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ కూడా లాభాల్లోనే ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 251 పాయిం‍ట్ల లాభంతో 26,656 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 22 పాయింట్ల లాభంతో 2,930 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది కూడా ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 78 పాయింట్ల లాభంతో 8,028 పాయింట్ల వద్ద క్లోజయింది. వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నా కూడా డాలర్‌ బలహీనపడటం, దేశ ఆర్థిక పరిస్థితులు బాగుండటం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. 



You may be interested

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Friday 21st September 2018

నిఫ్టీ ఇండెక్స్‌ వరుసగా మూడో సెషన్‌లో క్షీణిస్తూ వస్తూ బుధవారం 11,250 కీలక మద్దతు స్థాయి దిగువకు పడిపోయింది. డైలీ చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా బేర్‌ గుప్పిట్లోనే ఉంది. దాదాపు ఒక శాతంమేర క్షీణించింది. ఇక ఐటీ, మెటల్‌ మినహా సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి.  నిఫ్టీ-50 గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌తో ప్రారంభమైంది. 11,300 మార్క్‌కుపైకి కదిలింది. ఇంట్రాడేలో 11,332 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.

రాణా నిష్క్రమణతో ఇక్కట్లు!

Thursday 20th September 2018

యస్‌బ్యాంక్‌పై బ్రోకరేజ్‌ల అభిప్రాయం యస్‌బ్యాంక్‌ సారధ్య బాధ్యతల నుంచి రాణా కపూర్‌ వచ్చే ఏడాది జనవరి కల్లా వైదొలగాలని ఆర్‌బీఐ ఆదేశించింది. రాణా వైదొలగడం బ్యాంకు వృద్ధిపై ప్రభావం చూపుతుందని, బ్యాంకు నిధుల సమీకరణ యత్నాలు ఆలస్యమవుతాయని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. బ్యాంకు షేరు మరింత క్షీణించవచ్చని భావిస్తున్నాయి. బ్యాంకు షేరుపై బ్రోకింగ్‌ దిగ్గజాల అంచనాలు, అభిప్రాయాలు.. - ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: రేటింగ్‌ను అండర్‌ పెర్ఫామర్‌కు తగ్గించింది. టార్గెట్‌ ధరను రూ. 350

Most from this category