STOCKS

News


11,620పై స్థాయిలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 25th August 2018
Markets_main1535168391.png-19613

  • 47 పాయింట్లు అప్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం విదేశీ మార్కెట్‌లో 47 పాయింట్ల లాభంతో 11,621 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నిఫ్టీ 50 ఫ్యూచర్స్‌ ముగింపు 11,571 పాయింట్ల కన్నా అధిక స్థాయిలో ఉందని గమనించాలి. దీంతో అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి అనూహ్యా పరిస్థితులు తలెత్తనప్పుడు సోమవారం నిఫ్టీ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. 
అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం లాభాల్లో ముగియడం సానుకూల అంశం. నాస్‌డాక్‌ 68 పాయింట్ల లాభంతో 7,946 పాయింట్ల వద్ద, డౌజోన్స్‌ 133 పాయింట్ల లాభంతో 25,790 పాయింట్ల వద్ద, ఎస్‌అండ్‌పీ 500.. 18 పాయింట్ల లాభంతో 2,874 పాయింట్ల వద్ద ముగిశాయి. 
అయితే శుక్రవారం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 50.. 27 పాయింట్ల నష్టంతో 11,557 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85 పాయింట్ల నష్టంతో 38,251 పాయింట్లకు క్షీణించింది. మరోవైపు ఆసియా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి, చైనా షాంఘై కంపొసిట్‌ మినహా మిగతా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ఉండిపోయాయి. 



You may be interested

వేదాంత ఏడీఆర్‌ 6 శాతం జంప్‌..

Saturday 25th August 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు తగ్గితే.. టాటా మోటార్స్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, వేదాంత ఏడీఆర్‌లు పెరిగాయి.  వేదాంత ఏడీఆర్‌ అప్‌ వేదాంత ఏడీఆర్‌ ఏకంగా 6.16 శాతంమేర ఎగసింది. 12.76 డాలర్లకు పెరిగింది. విప్రో ఏడీఆర్‌ 2.77 శాతం వృద్ధితో 5.19 డాలర్లకు, టాటా మోటార్స్‌ ఏడీఆర్‌

మీ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డును మార్చుకున్నారా?

Saturday 25th August 2018

ఎస్‌బీఐ కస్టమర్లందరూ దృష్టి సారించాల్సిన అంశం ఒకటుంది. ఎస్‌బీఐ ఖాతాదారులుగా గతంలో మీరు తీసుకున్న డెబిట్‌ కార్టులను మార్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎస్‌బీఐ గతంలో ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డులను మ్యాగ్నటిక్‌ స్ట్రైప్‌ (మ్యాగ్‌స్ట్రైప్‌) కార్డులనే జారీ చేసింది. గత కొంత కాలంగా మరింత భద్రతా కోణంలో ఈఎంవీ చిప్‌లు ఉన్న కార్డులను జారీ చేస్తోంది. ఈ క్రమంలో ఈఎంవీ చిప్‌లు లేని కార్డులను ఈ ఏడాది డిసెంబర్‌ 31లోపు

Most from this category