News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Friday 16th November 2018
Markets_main1542338351.png-22059

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:37 సమయంలో 42 పాయింట్ల లాభంతో 10,663 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,630 పాయింట్లతో పోలిస్తే 33 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లోనే ముగిశాయి.  

నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. 
ఒక్క సింగపూర్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ మినహా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 21 పాయింట్ల లాభంతో 3,075 పాయింట్ల వద్ద ఉంది. ఇక తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 12 పాయింట్ల నష్టంతో 9,815 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 5 పాయింట్ల నష్టంతో 2,662 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 1 పాయింటు నష్టంతో 2,087 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 178 పాయింట్ల నష్టంతో 25,925 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 113 పాయింట్ల నష్టంతో 21,690 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు అప్‌..
అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.83 శాతం లేదా 209 పాయిం‍ట్ల లాభంతో 25,289 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.06 శాతం లేదా 29 పాయింట్ల లాభంతో 2,730 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 1.72 శాతం లేదా 123 పాయింట్ల లాభంతో 7,259 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సమసిపోతాయనే అంచనాలతో ఇండెక్స్‌లు పెరిగాయి. అమెరికా.. చైనా దిగుమతులపై మళ్లీ టారిఫ్‌లను విధించకపోవచ్చనే వార్తలు ఇందుకు కారణం. ఇండెక్స్‌ ఐదు రోజుల నష్టాలకు గురువారం తెరపడింది. యాపిల్‌ షేర్లు 2.5 శాతం పెరిగాయి. దీంతో ఎస్‌అండ్‌పీ 500లో టెక్నాలజీ ఇండెక్స్‌ ఎక్కువగా లాభపడింది. 



You may be interested

మార్కెట్‌పై వీటి ప్రభావం!!

Friday 16th November 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ► అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.83 శాతం లేదా 209 పాయిం‍ట్ల లాభంతో 25,289 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.06 శాతం లేదా 29 పాయింట్ల లాభంతో 2,730 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 1.72 శాతం లేదా 123 పాయింట్ల లాభంతో 7,259 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా-అమెరికా మధ్య

పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఈటీఎఫ్‌... ఏది బెటర్‌?

Thursday 15th November 2018

పీపీఎఫ్‌ పథకం ఎంతో కాలంగా సామాన్యులకు పెట్టుబడి సాధనంగా, పన్ను ఆదా ఉపకరణంగా ఉంటూ వస్తోంది. పెన్షన్‌ అవసరాల కోసం పొదుపు చేసుకునేందుకు కూడా దీన్ని ఎంతో మంది వినియోగించుకునే వారు ఉన్నారు. ఈపీఎఫ్‌ అయితే, ఉద్యోగుల తరఫున పనిచేస్తున్న సంస్థ కూడా తన వాటాను జమ చేస్తుంది. కానీ, పీపీఎఫ్‌ మాత్రం ఎవరికి వారు సొంతంగానే ఇన్వెస్ట్‌ చేసుకునే పథకమే. ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడి ఇస్తూ, పన్ను

Most from this category