STOCKS

News


నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌??

Wednesday 28th November 2018
Markets_main1543375311.png-22423

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:33 సమయంలో 35 పాయింట్ల లాభంతో 10,725 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,684 పాయింట్లతో పోలిస్తే 41 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా మంగళవారం లాభాల్లోనే ముగిశాయి.  

లాభాల్లో ఆసియా మార్కెట్లు.. 
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ ఫ్లాట్‌గా 3,090 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 32 పాయింట్ల లాభం 9,810 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 14 పాయింట్ల లాభంతో 2,589 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 3 పాయింట్ల లాభంతో 2,102 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 226 పాయింట్ల లాభంతో 26,558 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 196 పాయింట్ల లాభంతో 22,148 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

నష్టాల్లోంచి లాభాల్లోకి అమెరికా మార్కెట్లు 
అమెరికా మార్కెట్లు మంగళవారం చివరకు లాభాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.44 శాతం లేదా 108 పాయిం‍ట్ల లాభంతో 24,748 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.33 శాతం లేదా 9 పాయింట్ల లాభంతో 2,682 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 1 పాయింటు లాభంతో 7,082 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా, చైనా అధ్యక్షుల మధ్య శనివారం జరగనున్న సమావేశంలో వాణిజ్య ఉద్రిక్తతలక ఒక పరిష్కారం లభించవచ్చని అమెరికా ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో నష్టాల్లో ట్రేడవుతున్న అమెరికా మార్కెట్ల ప్రధాన సూచీలు ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చాయి. 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Wednesday 28th November 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:33 సమయంలో 35 పాయింట్ల లాభంతో 10,725 పాయింట్ల వద్ద ఉంది.  ♦ క్రూడ్‌ ధరలు బుధవారం పెరిగాయి. వచ్చే వారంలో ఒపెక్‌ దేశాల సమావేశం జరగనుంది. ఇందులో ఆయిల్‌ సరఫరా తగ్గింపుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 52

మీ పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిన ‘బీమా’లు

Wednesday 28th November 2018

సౌకర్యవంతంగా జీవించేందుకు కావాల్సిన సంపద కోసం చాలా మంది ఎంతో కష్టించి పనిచేస్తుంటారు. కానీ, జీవితంలో అనిశ్చిత పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు. ఆర్థికం భారం పడొచ్చు. తెలియకుండా వచ్చి పడే ఉపద్రవాల నుంచి కుటుంబానికి, సంపద రక్షణ కోసం బీమాను ప్రతి ఒక్కరూ పోర్ట్‌ఫోలియోలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ వ్యక్తి తన జీవితంలో చేర్చుకోవాల్సిన బీమా ఉత్పత్తుల వివరాలు ఇవి.   జీవిత బీమా ఓ వ్యక్తి కేవలం తన భద్రత,

Most from this category