STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Friday 14th September 2018
Markets_main1536896100.png-20243

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:52 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 41 పాయింట్ల లాభంతో 11,486 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 11,417 పాయింట్లతో పోలిస్తే 69 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క చైనా మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా గురువారం లాభాల్లో ముగిశాయి.  

ఆసియా సూచీలు లాభాల్లో..
ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 221 పాయింట్ల లాభంతో 23,042 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 29 పాయింట్ల లాభంతో 2,315 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 181 పాయింట్ల లాభంతో 27,195 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 19 పాయింటు లాభంతో 3,151 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 103 పాయిం‍ట్ల లాభంతో 10,830 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. అయితే  చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 5 పాయింట్ల నష్టంతో 2,681 పాయింట్ల వద్ద ఉంది.  

అమెరికా మార్కెట్లు రయ్‌..
అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 147 పాయిం‍ట్ల లాభంతో 26,145 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 15 పాయింట్ల లాభంతో 2,904 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 59 పాయింట్ల లాభంతో 8,013 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. యాపిల్‌ షేరు 2.4 శాతం పెరగడం, అమెరికాతో చైనా కొత్త వాణిజ్య చర్చలకు అంగీకారం తెలపడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపింది. ఎస్‌అండ్‌పీ టెక్నాలజీ ఇండెక్స్‌ 1.2 శాతంమేర పెరిగింది. ఒక్క రోజులో ఇంత ఎక్కువగా పెరగడం ఆగస్ట్‌ 2 నుంచి ఇదే తొలిసారి. యాపిల్‌ షేరు ఎగయడం ఇందుకు కారణం. 



You may be interested

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Friday 14th September 2018

బుధవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన నిఫ్టీ తర్వాత మార్నింగ్‌ సెషన్‌లో కరెక‌్షన్‌ అయ్యింది. అయితే మళ్లీ షార్ట్‌ కవరింగ్‌ వల్ల పుంజుకుంది. నిఫ్టీ ఇండెక్స్‌ 11,340 వద్ద ప​ఆరంభమైంది. ఇంట్రాడేలో 11,250 కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత 11,380కి పెరిగింది. చివరకు 82 పాయింట్ల లాభంతో 11,369 వద్ద ముగిసింది.  పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,286, 11,203 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 11,417,

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌.. ఏ బ్యాంకులకు సమస్య?

Thursday 13th September 2018

ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌’ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) గ్రూప్‌కు మీ బ్యాంక్‌ ఏమైనా భారీగా అప్పులిచ్చిందేమో చూడండి. ఇది దివాలా అంచుకు చేరుకుంది. దీంతో ఇచ్చిన మొత్తం తిరిగి రాకపోవచ్చు. ఇటీవలే రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా దీనికి ‘చెత్త’ రేటింగ్‌ ఇచ్చింది. దీంతో గ్రూప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏం చేయాలో తెలియక జట్టుపట్టుకుంటున్నాయి. రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ వల్ల దాదాపు

Most from this category