STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు అప్‌

Tuesday 16th April 2019
Markets_main1555384719.png-25148

ఆసియా సూచీలు స్వల్పహెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో మంగళవారం భారత్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 9.50 నిముషాలకు 40 పాయింట్ల లాభంతో 11,768 పాయింట్ల వద్ద కదులుతోంది. సోమవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,728 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా వుండగా, సోమవారం రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగియగా, తాజాగా ఆసియాలోని ప్రధాన సూచీలు స్వల్పహెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.



You may be interested

గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌

Tuesday 16th April 2019

కొద్ది రోజులుగా స్వల్ప శ్రేణిలో కదులుతున్న భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం దాదాపు అరశాతం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా లాభంతో 39,100 పాయింట్లపైన ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 11,740 పాయింట్ల ఎగువన మొదలయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో కోల్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, ఐఓసీ, హీరో మోటోకార్‌‍్ప, ఆసియన్‌ పెయింట్స్‌ షేర్లు 1-2 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోవైపు టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌,టాటా

మంగ‌ళ‌వారం వార్త‌ల్లోని షేర్లు

Tuesday 16th April 2019

వివిధ వార్త‌ల‌కు అనుగుణంగా మంగ‌ళ‌వారం ప్ర‌భావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు జెట్ ఎయిర్‌వేస్‌:-  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కంపెనీకి మ‌ధ్యంత‌ర నిధుల జారీకి రుణదాత‌లు అంగీక‌రించే అవ‌కాశం లేదు. ప్రెస్టేజ్ఎస్టేట్స్‌:-  త‌న అనుబంధ సంస్థ ద్వారా బాబిజీ రిటైలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మిగిలిన 51శాతం వాటాను రూ.316 కోట్ల‌కు కొనుగోలు చేసినట్లు ఎక్చ్సేంజ్‌ల‌కు స‌మాచారం ఇచ్చింది.  సిండికేట్ బ్యాంక్‌:- అన్ని ఎంసీఎల్ఆర్(మార్జినల్‌ కాస్ట్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు) రేట్ల‌పై 5 బేసిస్ పాయింట్ల‌ను త‌గ్గించింది.  ల‌క్ష్మి విలాస్ బ్యాంక్‌:-

Most from this category