STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు అప్‌

Wednesday 19th September 2018
Markets_main1537328177.png-20368

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ బుధవారం ఉదయం 8.30 గంటల సమయానికి 40 పాయింట్ల పెరుగుదలతో 11,347 పాయింట్ల వద్ద ట్రేడవుతుంది. క్రితం రోజు ఇక్కడ భారీ పతనం తర్వాత నిఫ్టీ ఫ్యూచర్‌ 11,407 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానమయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 40 పాయింట్లు పెరిగింది. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 1 శాతంపైగా ర్యాలీ జరపడం, తాజాగా ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి మినహా మిగిలినవి 1–1.5 శాతం లాభాలతో ట్రేడ్‌కావడంతో ఆఫ్‌షోర్‌ మార్కెట్లో నిఫ్టీ సైతం పెరిగింది. ఈ కారణంగా మన మార్కెట్‌ స్వల్ప గ్యాప్‌అప్‌తో ప్రారంభం కావొచ్చు. 
 



You may be interested

స్వల్పంగా కోలుకున్న రూపాయి

Wednesday 19th September 2018

క్రితం రోజు భారీగా నష్టపోయి 72.98 వద్ద ముగిసిన రూపాయి బుధవారం స్వల్పంగా కోలుకుంది. డాలరుతో రూపాయి మారకపు విలువ ట్రేడింగ్‌ ప్రారంభంలో 26 పైసలు రికవరీ అయ్యి, 72.72 వద్ద ట్రేడవుతోంది. డాలరు ఇండెక్స్‌ గత రాత్రి ముగింపుతో పోలిస్తే స్వల్పంగా 94.18 స్థాయికి తగ్గడం, పలు వర్థమాన కరెన్సీలు స్వల్పంగా బలపడిన నేపథ్యంలో రూపాయి కోలుకుంది. అలాగే ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ లాభాలతో ట్రేడ్‌కావడం, మన మార్కెట్‌

ప్రతీ సంక్షోభం సంపద సృష్టికి అవకాశమే!

Wednesday 19th September 2018

మార్కెట్లో సంక్షోభాలు, బుల్‌ ర్యాలీలు క్రమం తప్పకుండా కనిపించే పరిణామాలుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. 2008 నాటి ఆర్థిక సంక్షోభం ఇన్వెస్టర్లకు ఎన్నో పాఠాలను నేర్పింది. ఇన్వెస్టర్లకు చేదు అనుభవాలను మిగిల్చిన సంక్షోభాల్లో ఇదీ ఒకటి. ఆ సమయంలో మార్కెట్లు కుప్పకూలడంతో స్టాక్స్‌ చెల్లాచెదురయ్యాయి. నాటి నష్టాలను తట్టుకోలేక ఉన్నవన్నీ అమ్ముకుని బయటపడిన వారు ఎందరో. నిజానికి నాటి సంక్షోభ సమయంలో భయపడి ఉన్నదంతా అమ్ముకున్న వారు, ఆ తర్వాతి సంవత్సరం

Most from this category