STOCKS

News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 17th December 2018
Markets_main1545017534.png-22980

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:54 సమయంలో 36 పాయింట్ల లాభంతో 10,866 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,820 పాయింట్లతో పోలిస్తే 46 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి.  

ఆసియా మార్కెట్లు అప్‌.. 
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం లాభాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 39 పాయింట్ల లాభంతో 3,116 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 34 పాయింట్ల లాభంతో 9,807 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 3 పాయింట్ల లాభంతో 2,597 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 3 పాయింట్ల లాభంతో 2,072 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 41 పాయింట్ల లాభంతో 26,135 పాయింట్ల వద్ద, జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225... 162 పాయింట్ల లాభంతో 21,536 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు డౌన్‌
అమెరికా మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. ఇండెక్స్‌లు 2 శాతం మేర పడిపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.02 శాతం లేదా 497 పాయిం‍ట్ల నష్టంతో 24,100 పాయింట్ల వద్ద ముగిసింది. మే నెల నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే డౌజోన్స్‌ లాభాలన్నీ అవిరయ్యి.. 2.5 శాతం మేర నష్టపోయింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.91 శాతం లేదా 51 పాయింట్ల నష్టంతో 2,600 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఏప్రిల్‌ నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. ఎస్‌అండ్‌పీ కూడా ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే 2.75 శాతం మేర నష్టపోయింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.26 శాతం లేదా 160 పాయింట్ల నష్టంతో 6,910 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే ఈ ఇండెక్స్‌ 0.11 శాతం లాభంతో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మందగమనంపై నెలకొన్న ఆందోళనలను యూరప్‌ మరింత పెంచడం, చైనా ఆర్థిక గణాంకాలు అంచనాల కన్నా బలహీనంగా ఉండటం వంటి అంశాలు మార్కెట్లపై త్రీవ ప్రతికూల ప్రభావం చూపాయి.  



You may be interested

మార్కెట్‌ ఎటువైపు?

Monday 17th December 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:54 సమయంలో 36 పాయింట్ల లాభంతో 10,866 పాయింట్ల వద్ద ఉంది.  ♦ అమెరికా.. 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ప్రొడక్టుల దిగుమతులపై టారిఫ్‌ పెంపును మార్చి 2కి వాయిదా వేసింది. కాగా చైనా 200 బిలియన్‌ డాలర్ల ప్రొడక్టులపై జనవరి 1 నుంచి టారిఫ్‌లను 10

ఫండ్‌ మేనేజర్లకు తమ పథకాలపై ఉన్న నమ్మకమెంత?

Sunday 16th December 2018

రిటైల్‌ ఇన్వెస్టర్లు పనితీరు ఆధారంగా, రిస్క్‌ తదితర అంశాలను బేరీజు వేసుకుని మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఏ పథకం మంచిదని విచారించిన తర్వాతే వారు ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇన్వెస్టర్ల నుంచి వచ్చే నిధులను ఫండ్‌ మేనేజర్లు తమ శక్తి, సామర్థ్యాలు, తెలివితేటలతో వృద్ధికి అవకాశం ఉన్న చోట పెట్టుబడులు పెట్టి రాబడులు పంచుతుంటారు. అయితే, ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు చూస్తే... ఫండ్‌ మేనేజర్లు

Most from this category