STOCKS

News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ..

Wednesday 14th November 2018
Markets_main1542165848.png-21964

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:44 సమయంలో 34 పాయింట్ల లాభంతో 10,639 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,615 పాయింట్లతో పోలిస్తే 24 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా సోమవారం దాదాపు నష్టాల్లోనే ముగిశాయి.  

నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. 
అమెరికా మార్కెట్ల నష్టాల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 18 పాయింట్ల నష్టంతో 3,036 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 1 పాయింటు లాభం 9,776 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 6 పాయింట్ల నష్టంతో 2,648 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 6 పాయింట్ల నష్టంతో 2,064 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 131 పాయింట్ల నష్టంతో 25,661 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 26 పాయింట్ల నష్టంతో 21,784 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు డౌన్‌
అమెరికా మార్కెట్లు మంగళవారం దాదాపుగా నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.4 శాతం లేదా 101 పాయిం‍ట్ల నష్టంతో 25,286 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.15 శాతం లేదా 4 పాయింట్ల నష్టంతో 2,722 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ స్థిరంగా 7,200 పాయింట్ల వద్ద ముగిసింది. ఎనర్జీ షేర్లు నష్టపోవడం వల్ల ఎస్‌అండ్‌పీ 500 నష్టాల్లోనే ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500లో ఎనర్జీ షేర్లకు అధిక వెయిటేజీ ఉంది. క్రూడ్‌ ధరలు భారీగా పడిపోవడం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. టెక్నాలజీ స్టాక్స్‌ రిబౌండ్‌ అవ్వడం వల్ల నాస్‌డాక్‌ నిలకడగానే ఉంది.

 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Wednesday 14th November 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు మంగళవారం దాదాపుగా నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.4 శాతం లేదా 101 పాయిం‍ట్ల నష్టంతో 25,286 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.15 శాతం లేదా 4 పాయింట్ల నష్టంతో 2,722 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ స్థిరంగా 7,200 పాయింట్ల వద్ద ముగిసింది. ఎనర్జీ షేర్లు నష్టపోవడం వల్ల ఎస్‌అండ్‌పీ 500

భార్యా భర్తలకూ ఒకటే పాలసీ.. చూడాల్సినవివే...

Wednesday 14th November 2018

జాయింట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ... జీవిత భాగస్వాములు ఇద్దరికీ కలిపి బీమా రక్షణ అందించే ఏకైక పాలసీ. భార్య గృహిణి అయిటే టర్మ్‌ పాలసీ తీసుకోవడం సాధ్యం కాదు. భాగస్వాములు ఇద్దరూ ఉద్యోగులు అయితే ఎవరికి వారే టర్మ్‌ పాలసీలు తీసుకోవచ్చు. అయితే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కానీ, కాస్త తక్కువ ప్రీమియానికే, భార్య గృహిణి అయినప్పటికీ లభించే పాలసీయే... జాయింట్‌ లైఫ్‌ టర్మ్‌ పాలసీ. దీనికి సంబంధించిన వివరాలు

Most from this category