ఎస్‌జీఎక్స్ నిఫ్టీ పైకి
By Sakshi

ఎస్‌జీఎక్స్ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:38 సమయంలో సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 33 పాయింట్ల లాభంతో 11,085 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్ బుధవారం ముగింపు స్థాయి 11,062 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. మిశ్రమంగా ఆసియా సూచీలు.. నష్టాల్లో అమెరికా మార్కెట్లు..
ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్ నికాయ్ 225.. 32 పాయింట్ల నష్టంతో 24,002 పాయింట్ల వద్ద, తైవాన్ సూచీ తైవాన్ ఇండెక్స్ 27 పాయింట్ల లాభంతో 11,001 పాయింట్ల వద్ద, సింగపూర్ ఇండెక్స్ స్ట్రైట్స్ టైమ్స్ 21 పాయింట్ల లాభంతో 3,260 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్ షాంఘై కంపొసిట్ 2 పాయింట్ల నష్టంతో 2,805 పాయింట్ల వద్ద, హాంగ్ కాంగ్ ఇండెక్స్ హాంగ్ సెంగ్ 8 పాయింట్ల నష్టంతో 27,809 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్ కొస్పి 14 పాయింట్ల లాభంతో 2,353 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.
అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ 106 పాయింట్ల (0.4 శాతం) క్షీణతతో 26,385 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 500.. 10 పాయింట్ల (0.33 శాతం) నష్టంతో 2,905 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్డాక్ కంపొసిట్ 17 పాయింట్ల (0.21 శాతం) నష్టంతో 7,990 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వు ఎంత కాలం రేట్లను పెంచుకుంటూ వెళ్తోందనన్న భయాలతో ఇన్వెస్టర్లు రిస్క్‌ను తగ్గించుకోడానికి మొగ్గుచూపడం స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో లాభాల్లో ఉన్న మార్కెట్లు చివరకు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కాగా ఫెడ్ వడ్డీ రేట్లను పావు శాతంమేర పెంచింది. దీంతో ఫెడ్ వడ్డీ రేట్ల శ్రేణి 2-2.25 శాతానికి పెరిగింది.
You may be interested
మార్కెట్‌పై వీటి ప్రభావం
Thursday 27th September 2018గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ 106 పాయింట్ల (0.4 శాతం) క్షీణతతో 26,385 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 500.. 10 పాయింట్ల (0.33 శాతం) నష్టంతో 2,905 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్డాక్ కంపొసిట్ 17 పాయింట్ల (0.21 శాతం) నష్టంతో 7,990 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వు ఎంత కాలం
యస్ బ్యాంకుపై ఇప్పటికీ జేపీ మోర్గాన్, మాక్వేర్ సానుకూలమే
Thursday 27th September 2018యస్ బ్యాంకు చీఫ్ రాణాకపూర్ పదవీకాలం వచ్చే ఏడాది జనవరి వరకే పరిమితం చేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం తర్వాత షేరు కుదేలైంది. ఈ నెల 25న జరిగిన యస్ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఆర్బీఐ ఆదేశాలను అంగీకరించడంతోపాటు... రాణా కపూర్ పదవీకాలాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు మూడు నెలల పాటు పొడిగింపు ఇవ్వాలంటూ ఆర్బీఐని కోరాలని నిర్ణయించింది. దీంతో కొత్త సారధిని ఎంపిక చేసుకునేందుకు వీలు చిక్కుతుందని,