STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు అప్‌

Thursday 6th September 2018
Markets_main1536203976.png-19989

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:38 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 32 పాయింట్ల లాభంతో 11,536 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో బుధవారం నాటి ముగింపు 11,518 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా బుధవారం మిశ్రమంగానే ముగిశాయి.  

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..
ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 52 పాయింట్ల నష్టంతో 22,528 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 124 పాయింట్ల నష్టంతో 27,119 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల లాభంతో 2,296 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 8 పాయింట్ల లాభంతో 3,164 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 8 పాయింట్ల లాభంతో 2,713 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 32 పాయిం‍ట్ల నష్టంతో 10,963 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.   

నాస్‌డాక్‌ డౌన్‌..
అమెరికా స్టాక్‌ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 22 పాయింట్ల లాభంతో 25,975 పాయింట్ల వద్ద, ఎస్‌అండ్‌పీ 500.. 8 పాయింట్ల క్షీణతతో 2,888 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 96 పాయింట్ల క్షీణతతో 7,995 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ షేర్లు పడిపోవడం ఇందుకు ప్రధాన కారణం. వీటికి నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లలో అధిక వెయిటేజీ ఉంది. 



You may be interested

మార్కెట్‌ ఎటు వైపు?

Thursday 6th September 2018

నిఫ్టీ బుధవారం నష్టాల్లోనే ప్రారంభమైంది. రోజంతా అదే ట్రెండ్‌తో నడిచింది. ఇంట్రాడేలో రూపాయి 71.96 కనిష్ట స్థాయిని తాకడంతో నిఫ్టీ ఇండెక్స్‌ నష్టాలు మరింత పెరిగాయి. అయితే రూపాయి మళ్లీ కొంత రికవరీ చెందటంతో ఇండెక్స్‌ నష్టాలు చివరి గంటలో తగ్గాయి.  నిఫ్టీ ఇండెక్స్‌కు 11,400 వద్ద కీలక మద్దతు లభించింది. డైలీ చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇది హ్యామర్‌ రకపు ప్యాట్రన్‌ మాదిరి ఉంది.   నిఫ్టీ-50 బుధవారం 11,514

స్మాల్‌ జెమ్స్‌ పట్టుకునే సరైన సమయం!

Wednesday 5th September 2018

స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ 2017లో కొత్త పుంతలు తొక్కాయి. రాబడులతో కిక్కెక్కించాయి. స్వల్ప కాలంలోనే విపరీతంగా ర్యాలీ చేస్తుండడంతో ఇన్వెస్టర్లు వాటికి ఆకర్షితులయ్యారు. 2018లో దృశ్యం తిరగబడింది. ఈ ఏడాది స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో చాలా స్టాక్స్‌ భారీ నష్టాల పాలు చేసినవే. కొన్ని కొద్ది మేర కోలుకోగా, ఇంకొన్ని కింద పడి లేచే శక్తి కోసం చూస్తున్న స్థితిలో ఉండిపోయాయి. ఈ పరిణామంతో చాలా మంది ఇన్వెస్టర్లు వీటికి దూరంగా

Most from this category