STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు అప్‌

Thursday 17th January 2019
Markets_main1547695286.png-23620

 జపాన్‌ మినహా ఆసియా మార్కెట్లు గురువారం పాజిటివ్‌గా ట్రేడవుతున్న నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగింది. భారత్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45 గంటలకు 10,952 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,922 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కాగా స్పాట్‌ నిఫ్టీ 10,890 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఆసియా మార్కెట్లో జపాన్‌ సూచి నికాయ్‌ 0.3 శాతం తగ్గగా, హాంకాంగ్‌, సింగపూర్‌, తైవాన్‌, కోస్పి సూచీలు స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి. గత రాత్రి అమెరికా సూచీలు బ్యాంకింగ్‌ షేర్ల దన్నుతో వారాల గరిష్టస్థాయి వద్ద ముగిసాయి.



You may be interested

పాజిటివ్‌ ఓపెనింగ్‌

Thursday 17th January 2019

జపాన్‌ మినహా ఆసియా సూచీలు పాజిటివ్‌గా ట్రేడవుతున్న నేపథ్యంలో గురువారం స్టాక్‌ సూచీలు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 92 పాయింట్ల పెరుగుదలతో 36,413 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 10,920 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు స్వల్పలాభంతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. యస్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనీలీవర్‌, హిందాల్కోలు ట్రేడింగ్‌ ప్రారంభంలో స్వల్పంగా నష్టపోయాయి.    నెలరోజుల గరిష్టానికి అమెరికా

నిధుల ప్రవాహం సన్నగిల్లడమే అసలు సమస్య!

Wednesday 16th January 2019

మార్కెట్‌పై మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అభిప్రాయం దేశీయ మార్కెట్లలోకి వస్తున్న దేశీయ, విదేశీయ నిధుల ప్రవాహం సన్నగిల్లుతోందని, మార్కెట్‌ పరుగులకు ఇదే అడ్డంకిగా మారవచ్చని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రతినిధి కౌస్తుభ్‌ చెప్పారు. మార్కెట్లోకి సిప్‌ ద్వారా వచ్చే మొత్తం మాత్రం పెరుగుతోందని, కానీ ఇందులో పెరుగుదల రేటు సన్నగిల్లిందని తెలిపారు. మార్కెట్లోకి సరాసరిన 8-9 వేల కోట్ల రూపాయల నిధులు వచ్చే స్థితి నుంచి రూ.6వేల కోట్లకు పడిపోయాయన్నారు. అందువల్ల మార్కెట్‌ ఊపు

Most from this category