STOCKS

News


స్వల్ప లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Tuesday 9th October 2018
Markets_main1539055591.png-20939

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 3 పాయింట్ల లాభంతో 10,370 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,379 పాయింట్లతో పోలిస్తే 9 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ మంగళవారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..
ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 219 పాయింట్ల నష్టంతో 23,564 పాయింట్ల వద్ద,  హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 26,204 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 7 పాయింట్ల నష్టంతో 3,174 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 13 పాయిం‍ట్ల లాభంతో 10,468 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 1 పాయింటు నష్టంతో 2,716 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇక దక్షిణ కొరియా మార్కెట్‌కు సెలవు. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి సోమవారం 14 పాయింట్ల నష్టంతో 2,254 పాయింట్ల వద్ద ముగిసింది. 

డౌజోన్స్‌ అప్‌.. మిగతావి డౌన్‌..
అమెరికా మార్కెట్లు కూడా సోమవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 40 పాయిం‍ట్ల లాభంతో 26,486 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1 పాయింట్ల నష్టంతో 2,884 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 52 పాయింట్ల నష్టంతో 7,736 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించొచ్చనే భయాలు ప్రతికూల ప్రభావం చూపాయి. నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లలో మైక్రోసాఫ్ట్‌ కార్ప్‌ 1.1 శాతం, అడోబ్‌ సిస్టమ్స్‌ 3.2 శాతంమేర క్షీణించాయి. 



You may be interested

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Tuesday 9th October 2018

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు కూడా సోమవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 40 పాయిం‍ట్ల లాభంతో 26,486 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1 పాయింట్ల నష్టంతో 2,884 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 52 పాయింట్ల నష్టంతో 7,736 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించొచ్చనే భయాలు

బోవోఐ ఆక్సా క్రెడిట్‌రిస్క్‌ ఫండ్‌ రూ.100 కోట్ల మాఫీ

Tuesday 9th October 2018

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ దెబ్బకు బీవోఐ ఆక్సా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌ రూ.100 కోట్లను నష్టపోయింది. అంటే, ఈ ఫండ్‌ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కమర్షియల్‌ పేపర్లలో గతంలో పెట్టుబడులు పెట్టింది. ఇందులో రూ.105 కోట్ల మేర ఈ అక్టోబర్‌ 29న గడువు తీరిపోనున్నాయి. ఈ మొత్తాన్ని తన పుస్తకాల్లో రైటాఫ్‌ (రద్దు) చేసింది. దీంతో ఈ ఫండ్‌ ఎన్‌ఏవీ అక్టోబర్‌ 5న 5.17 శాతం తగ్గిపోయింది. ‘‘ఏవైనా ఉపసంహరణలు ఎదురైతే అవి ప్రస్తుత

Most from this category