ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 29 పాయింట్లు అప్
By Sakshi

ఎస్‌జీఎక్స్ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:37 సమయంలో సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 29 పాయింట్ల లాభంతో 11,752 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో సోమవారం నాటి ముగింపు 11,705 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ మంగళవారం కూడా పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు చైనా మినహా ఇతర ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. చైనా మినహా ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లో.. అమెరికా మార్కెట్లో మళ్లీ రికార్డ్‌లు
ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. అయితే ఒక్క చైనా మాత్రం 4 పాయింట్ల స్వల్ప క్షీణతతో 2,777 పాయింట్ల వద్ద ఉంది. ఇక జపాన్ నికాయ్ 225.. 145 పాయింట్ల లాభంతో 22,945 పాయింట్ల వద్ద ఉంది. హాంగ్ కాంగ్ ఇండెక్స్ హాంగ్ సెంగ్ 57 పాయింట్ల లాభంతో 28,328 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్ కొస్పి 6 పాయింట్ల లాభంతో 2,305 పాయింట్ల వద్ద, తైవాన్ సూచీ తైవాన్ ఇండెక్స్ 83 పాయింట్ల లాభంతో 10,985 పాయింట్ల వద్ద, సింగపూర్ ఇండెక్స్ స్ట్రైట్స్ టైమ్స్ 31 పాయింట్ల లాభంతో 3,256 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.
అమెరికా మార్కెట్ల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం ఎస్అండ్పీ 500, నాస్డాక్ ఇండెక్స్‌లు రికార్డ్ స్థాయిల వద్ద ముగిశాయి. ఇదే ట్రెండ్ సోమవారం కూడా కనిపించింది. ఈ రెండు సూచీలు వరుసగా రెండో సెషన్లోనూ మళ్లీ కొత్త గరిష్ట స్థాయివ వద్ద ముగిశాయి. అమెరికా, మెక్సికో మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇందకు కారణం. టెక్నాలజీ స్టాక్స్ నాస్డాక్ను తొలిసారిగా 8,000 మార్క్‌కు పైకి తీసుకెళ్లాయి. ఇక అమెరికా తర్వాత కెనడాతో చర్చలు ప్రారంభించనుంది. ఎస్అండ్పీ 500 సోమవారం 22 పాయింట్ల పెరుగుదలతో 2,896 పాయింట్ల వద్ద ముగిసింది. ఇండెక్స్‌కు ఇది జీవిత కాల గరిష్ట స్థాయి. నాస్డాక్ ఇండెక్స్ 72 పాయింట్ల లాభంతో 8,017 వద్ద ముగిసింది. నాస్డాక్ 8,000 మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ 259 పాయింట్ల లాభంతో 26,049 వద్ద ముగిసింది.
You may be interested
మార్కెట్ పెరుగుతుందా? తగ్గుతుందా?
Tuesday 28th August 2018నిప్టీ-50 వరుసగా ఆరో వారం కూడా అప్ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఇండెక్స్ సోమవారం తొలిసారిగా 11,700 మార్క్‌ను తాకింది. అలాగే రికార్డ్ స్థాయి వద్ద క్లోజ్ అయ్యింది. అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు ఇందుకు కారణం. బ్యాంక్ షేర్ల ర్యాలీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచింది. ఇండెక్స్ తన డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్స్‌లో సోమవారం బుల్లిష్ క్యాండిల్‌ను ఏర్పరచింది. నిఫ్టీ-50 సోమవారం 11,600 మార్క్కుపైనప్రారంభమైంది. తర్వాత ఇంట్రాడేలో 11,700 పాయింట్ల గరిష్ట స్థాయిని
ఈ సమయంలో ఏ షేర్లను ఎంచుకోవాలి...?
Tuesday 28th August 2018దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది భిన్నమైన ర్యాలీలను చేస్తుండడం గమనించొచ్చు. ఏడాది ఆరంభంలో కరెక్షన్ను చవిచూసిన సూచీలు, ఆ తర్వాత నుంచి క్రమంగా రికవరీ బాట పట్టి జీవితకాల గరిష్టాలకు దూసుకెళ్లాయి. కానీ, తరచిచూస్తే ఈ ర్యాలీ మార్కెట్ వ్యాప్తంగా జరుగుతున్నది మాత్రం కాదు. ఎంపిక చేసిన షేర్లలోనే కొనుగోళ్లు జరుగుతూ, సాగిపోతున్న ర్యాలీ మాదిరిగా ఉంది. మరి ఈ సమయంలో ఏ షేర్లను ఎంచుకోవాలి? అన్న సందేహం