STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు అప్‌

Friday 11th January 2019
news_main1547177350.png-23514

 ఆసియా మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌గా ట్రేడవుతున్న నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగింది. భారత్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.50 గంటలకు 10,887 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,857 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కాగా స్పాట్‌ నిఫ్టీ 10,821 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఆసియా మార్కెట్లో జపాన్‌ సూచి నికాయ్‌ 0.7 శాతం పెరగ్గా, హాంకాంగ్‌, సింగపూర్‌, తైవాన్‌, కోస్పి సూచీలు స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి. గత రాత్రి స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన అమెరికా సూచీలు పాజిటివ్‌గా ముగిసాయి. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 11th January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌:- జామ్నా నగ‌ర్‌లోని చ‌మురు శుద్ది యూనిట్‌ను నెల‌రోజు పాటు ష‌ట్‌డౌన్ చేసేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తుంది.  యూనిట్లో యంత్రాల ప‌నితీరును త‌నిఖీ చేసే ప్రక్రియ‌లో భాగంగా జ‌న‌వ‌రి 16నుంచి 4వారాల పాటు మూసివేస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. హెచ్ఎఫ్‌సీఎల్‌:- ఎల్అండ్ టీ, ఐటీఐ క‌న్షారియంల నుంచి రూ.500 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది. భార‌త్ నెట్ ఫేజ్‌-2 ప్రాజెక్ట్‌లో భాగంగా

30 ఏళ్లకే వైద్య బీమా...: మెజారిటీ మనోగతం

Friday 11th January 2019

ఆరోగ్యకరమైన సమస్యలు భారతీయులకు నేడు సవాలుగా మారాయి. అనారోగ్యం బారిన పడితే భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. అందుకేనేమో మన దేశంలో 85 శాతం మంది 30 ఏళ్లకే వైద్య బీమాను తీసుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నారు. 62.8 శాతం మంది అయితే వైద్య బీమా ఉండడం తప్పనిసరి అని భావిస్తున్నారు. జీవోక్యూఐఐ-ఇండియా ఫిట్‌ 2019 నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. మన దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పట్ల

Most from this category