STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22 పాయింట్లు అప్‌

Wednesday 15th May 2019
Markets_main1557890516.png-25739

 ప్రపంచ ప్రధాన మార్కెట్లలో జరుగుతున్న షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీలో భాగంగా ఆసియా మార్కెట్లు పెరిగిన నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ బుధవారం స్వల్పలాభాలతో  ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50 గంటలకు  22  పాయింట్ల లాభంతో 11,264 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,242 పాయింట్ల వద్ద ముగిసింది. తాజాగా ఆసియాలో జపాన్‌ నికాయ్‌ సూచి స్వల్పంగా తగ్గగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ 0.8 శాతం పెరిగింది.  సింగపూర్‌, తైవాన్‌, చైనా సూచీలు కూడా స్వల్పలాభాలతో కదులుతున్నాయి. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 0.8 శాతం వరకూ పెరిగి ముగిసాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ పరిష్కారం డోలాయమానంలో  కొనసాగడంతో గత కొద్దిరోజులుగా భారీ నష్టాల్ని చవిచూసిన ప్రపంచ ప్రధాన మార్కెట్లు జరిపిన షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీలో భాగంగా భారత్‌ సూచీలు సైతం క్రితం రోజు తొమ్మిదిరోజుల నష్టాలకు బ్రేక్‌వేసి, లాభాలతో ముగిసిన సంగతి తెలిసిందే. 



You may be interested

గ్యాప్‌అప్‌ ప్రారంభం

Wednesday 15th May 2019

 ప్రపంచ ప్రధాన మార్కెట్లలో జరుగుతున్న షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీలో భాగంగా ఆసియా మార్కెట్లు పెరిగిన నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ బుధవారం గ్యాప్‌అప్‌తో  ప్రారంభమమయ్యింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంతో 37,540 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,272 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, గెయిల్‌, పవర్‌గ్రిడ్‌, అదాని పోర్ట్స్‌, యూపీఎల్‌లు 1 శాతం వరకూ ట్రేడింగ్‌ ప్రారంభంలో లాభనపడ్డాయి. మరోవైపు యస్‌బ్యాంక్‌ 4

అస్థిరతల సమయాల్లో నమ్ముకోతగ్గ స్టాక్స్‌!

Tuesday 14th May 2019

ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నం కావడంతో మే ఆరంభం నుంచి విదేశీ ఇన్వె‍స్టర్లు అమ్మకాలు చేస్తున్నారు. అమెరికా-చైనా మధ్య తాజాగా టారిఫ్‌ల యుద్ధం ఆరంభం కావడం కూడా నష్టాలు, అస్థిరతలు పెరిగిపోవడానికి కారణమయ్యాయి. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత ఆటుపోట్లు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ మంది అనలిస్టుల సిఫారసుల ఆధారంగా అస్థిరతల సమయంలో పెట్టుబడులకు పరిశీలించ తగిన స్టాక్స్‌ వివరాలు ఇవి.    డీబీకార్ప్‌ 12 రాష్ట్రాల్లో వార్తా పత్రికల మాధ్యమంలో

Most from this category