STOCKS

News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Monday 22nd October 2018
Markets_main1540178581.png-21334

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:46 సమయంలో 22 పాయింట్ల లాభంతో 10,347 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,303 పాయింట్లతో పోలిస్తే 44 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగానే ముగిశాయి. 

చైనా రయ్‌.. రయ్‌..
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 70 పాయింట్ల నష్టంతో 22,462 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 8 పాయింట్ల లాభంతో 3,071 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 2 పాయిం‍ట్ల లాభంతో 9,920 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ ఏకంగా 97 పాయింట్ల లాభంతో 2,647 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 1 పాయింటు నష్టంతో 2,155 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 476 పాయింట్ల లాభంతో 26,038 పాయింట్ల వద్ద ఉన్నాయి.  

మిశ్రమంగా అమెరికా మార్కెట్‌
అమెరికా మార్కెట్‌ శుక్రవారం దాదాపుగా నష్టాల్లోనే ముగిసింది. ఇండెక్స్‌లు ప్రారంభ లాభాలను చివరి వరకు నిలుపుకోలేకపోయాయి. డౌజోన్స్‌ లాభాల్లో ముగిస్తే.. మిగతా రెండు ప్రధాన ఇండెక్స్‌లు నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.3 శాతం లేదా 65 పాయిం‍ట్ల లాభంతో 25,444 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ షేరు 8.8 శాతం పెరగడం సానుకూల ప్రభావం చూపింది. 2008 అక్టోబర్‌ 28 నుంచి చూస్తే ఈ స్టాక్‌ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. కంపెనీ ఎర్నింగ్స్‌ అంచనాలు మించి ఉండటం ఈ పెరుగుదలకు కారణం. ఎస్‌అండ్‌పీ 500.. 0.04 శాతం లేదా 1 పాయింటు నష్టంతో 2,767 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.48 శాతం లేదా 36 పాయింట్ల నష్టంతో 7,449 పాయింట్ల వద్ద ముగిసింది. ఫేస్‌బుక్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ షేర్లు తగ్గుదల ప్రతికూల ప్రభావం చూపింది. వారం మొత్తంగా చూస్తే డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.4 శాతం పెరిగింది. ఈ ఇండెక్స్‌ గత మూడు వారాలుగా పడుతూనే వచ్చింది. ఇక నాస్‌డాక్‌ 0.6 శాతం నష్టపోయింది. 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Monday 22nd October 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 70 పాయింట్ల నష్టంతో 22,462 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 8 పాయింట్ల లాభంతో 3,071 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 2 పాయిం‍ట్ల లాభంతో 9,920 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ ఏకంగా 97 పాయింట్ల లాభంతో 2,647

ఆటుపోట్లలో డివిడెండ్‌ ఇచ్చే స్టాక్స్‌ నయం

Monday 22nd October 2018

ఈ ఏడాది మొదట్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లలో మొదలైన అస్థిరతలు కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల వరకు మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగొచ్చని అత్యధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌ అస్థిరతల్లో వాటాదారులకు డివిడెండ్‌ ఎక్కువగా పంచే స్టాక్స్‌ మెరుగైన ఆప్షన్‌ అన్నది తెలిసిందే. కనుక మరోసారి డివిడెండ్‌ ఈల్డ్‌ ఎక్కువగా ఉన్న స్టాక్స్‌పై దృష్టి సారించేందుకు అనువైన సమయంగా కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ పేర్కొంది.    ఆటుపోట్లతో కూడిన మార్కెట్లలో పోర్ట్‌ఫోలియోకు

Most from this category