STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌..

Tuesday 6th November 2018
Markets_main1541474720.png-21729

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 21 పాయింట్ల లాభంతో 10,581 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,550 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా సోమవారం మిశ్రమంగానే ముగిశాయి. 

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. 
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అయితే సింగపూర్‌ మార్కెట్‌కు మాత్రం సెలవు. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ సోమవారం 56 పాయింట్ల నష్టంతో 3,060 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక మంగళవారం రోజు.. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 86 పాయిం‍ట్ల నష్టంతో 9,803 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 23 పాయింట్ల నష్టంతో 2,642 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 3 పాయింట్ల స్వల్ప లాభంతో 2,079 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 42 పాయింట్ల నష్టంతో 25,892 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 222 పాయింట్ల లాభంతో 22,121 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.   

నాస్‌డాక్‌ డౌన్‌.. డౌజోన్స్‌, ఎప్‌అండ్‌పీ అప్‌..
అమెరికా మార్కెట్లు కూడా సోమవారం మిశ్రమంగానే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.76 శాతం లేదా 190 పాయిం‍ట్ల లాభంతో 25,461 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.56 శాతం లేదా 15 పాయింట్ల లాభంతో 2,738 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే నాస్‌డాక్‌ కంపొసిట్‌ మాత్రం 0.38 శాతం లేదా 28 పాయింట్ల నష్టంతో 7,328 పాయింట్ల వద్ద ముగిసింది. ఫైనాన్షియల్‌, ఎనర్జీ, డిఫెన్సివ్‌ రంగాల స్టాక్స్‌ పెరుగుదల కారణంగా సోమవారం ఎస్‌అండ్‌పీ 500 లాభాల్లో ముగిసింది. 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Tuesday 6th November 2018

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగానే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.76 శాతం లేదా 190 పాయిం‍ట్ల లాభంతో 25,461 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.56 శాతం లేదా 15 పాయింట్ల లాభంతో 2,738 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే నాస్‌డాక్‌ కంపొసిట్‌ మాత్రం 0.38 శాతం లేదా 28 పాయింట్ల నష్టంతో 7,328 పాయింట్ల వద్ద ముగిసింది. ఫైనాన్షియల్‌,

35వేల దిగువకు సెన్సెక్స్‌

Monday 5th November 2018

ఆర్థిక, ఔషధ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, అటో షేర్ల పతనంతో మార్కెట్‌ సోమవారం నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 61 పాయింట్ల కోల్పోయి 34,951 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్ల నష్టపోయి 10,528 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలోని ప్రభుత్వరంగబ్యాంక్‌, రియల్టీ, మెటల్‌, ఐటీ రంగాలకు చెంది సూచీలు లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండో విడుత మూలధన సాయం కింద రూ.54వేల కోట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే

Most from this category