STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు అప్‌

Thursday 14th March 2019
Markets_main1552533197.png-24592

 బ్రెగ్జిట్‌ సందిగ్దత నేపథ్యంలోఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నప్పటికీ, మూడురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40 గంటలకు 11,386 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,366 పాయింట్ల వద్ద ముగిసింది. గత  రాత్రి అమెరికా డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌,  నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ సూచీలు అరశాతంపైగా పెరిగాయి. తాజాగా ఆసియాలో చైనా షాంఘై సూచి ఒకశాతం నష్టపోగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచి స్వల్పలాభంతో ట్రేడవుతోంది. జపాన్‌ నికాయ్‌ అరశాతం పెరిగింది. సింగపూర్‌ స్రె‍్టయిట్‌టైమ్స్‌, కొరియా కోస్పిలు స్వల్పనష్టంతోనూ, తైవాన్‌ వెయిటెడ్‌ సూచి స్వల్పలాభంతోనూ కదులుతున్నాయి.   ఎటువంటి డీల్‌ లేకుండా బ్రెగ్జిట్‌ (యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం) వద్దంటూ గత రాత్రి బ్రిటన్‌ పార్లమెంటు ఓటుచేసింది. ఈ కారణంగా బ్రెగ్జిట్‌ అంటూ జరిగితే యూరోపియన్‌ యూనియన్‌తో ఒక డీల్‌తోనే జరుగుతుంది. అయితే బ్రిటన్‌ ప్రధాని థెరేసా మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్‌ డీల్‌ మంగళవారం బ్రిటన్‌ పార్లమెంటు తిరస్కరించిన సంగతి తెలిసింది. బుధవారంనాటి ఓటింగ్‌ ఫలితం దృష్ట్యా మరో కొత్త డీల్‌కు చర్చలు జరిగే అవకాశం వుంది. 



You may be interested

పాజిటివ్‌ ప్రారంభం

Thursday 14th March 2019

మూడురోజుల పాటు భారీ ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు గురువారం తిరిగి పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 80 పాయింట్లు లాభంతో 37840 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, 40 పాయింట్లు జంప్‌చేసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11382 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, జీ టెలి, యస్‌బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం ప్రారంభంలో 0.5 శాతం నుంచి 3 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు టాటా మోటార్స్‌, హింద్‌ పెట్రో, బీపీసీఎల్‌,

మార్కెట్లపై ఎన్నికల ప్రభావం...!

Thursday 14th March 2019

రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోనున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయన్న ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొంది. అయితే, ఎన్నికల ఫలితాల ప్రభావం మార్కెట్లపై స్వల్ప కాలం పాటేనంటోంది క్వాంటం మ్యూచువల్‌ ఫండ్‌. ఇందుకు సంబంధించి ఓ అధ్యయనం చేసి గణాంకాలను విడుదల చేసింది.    2004 ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ సర్కారు ఓటమి పాలు కావడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మే 12న 5,358 పాయింట్ల నుంచి మే 21 నాటికి

Most from this category