STOCKS

News


స్వల్ప లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Monday 24th December 2018
Markets_main1545621968.png-23180

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:49 సమయంలో 9 పాయింట్ల లాభంతో 10,769 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,767 పాయింట్లతో పోలిస్తే 2 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు శుక్రవారం కూడా నష్టపోయాయి.  

ఆసియా మార్కెట్లకు స్వల్ప నష్టాలు
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 5 పాయింట్ల నష్టంతో 3,040 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 8 పాయింట్ల నష్టంతో 9,638 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ ఫ్లాట్‌గా 2,516 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 5 పాయింట్ల నష్టంతో 2,056 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 181 పాయింట్ల నష్టంతో 25,572 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా జపాన్‌ మార్కెట్‌కు సెలవు. జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225 శుక్రవారం 226 పాయింట్ల నష్టంతో 20,166 పాయింట్ల వద్ద ముగిసింది.  

అమెరికా మార్కెట్లు మళ్లీ పతనం
అమెరికా మార్కెట్లు శుక్రవారం మళ్లీ పతనమయ్యాయి. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ దాదాపు 3 శాతం.. డౌజోన్స్‌ ఇండెక్స్‌ దాదాపు 2 శాతం, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 2 శాతానికి పైగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 1.81 శాతం లేదా 414 పాయిం‍ట్ల నష్టంతో 22,445 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 2.06 శాతం లేదా 51 పాయింట్ల నష్టంతో 2,416 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.99 శాతం లేదా 195 పాయింట్ల నష్టంతో 6,333 పాయింట్ల వద్ద ముగిసింది. యూరోజోన్‌లోని అస్థిర పరిస్థితులు, చైనా మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచ వృద్ధి నెమ్మదించడం, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు, అమెరికాలో కార్పొరేట్‌ ప్రాఫిట్స్‌ తగ్గడం, అమెరికా ప్రభుత్వ షాట్‌డౌన్‌ భయాలు వంటి పలు అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Monday 24th December 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:49 సమయంలో 9 పాయింట్ల లాభంతో 10,769 పాయింట్ల వద్ద ఉంది.  ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 5 పాయింట్ల నష్టంతో 3,040 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 8 పాయింట్ల నష్టంతో 9,638

2018 ‘పన్ను’ జ్ఞాపకాలు

Sunday 23rd December 2018

పన్ను ఆదా కోసం పెట్టుబడుల ప్రణాళికలు రచించుకునే వారు, ఈ ఏడాది పన్నుల పరంగా ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను తప్పుక పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటంటే...   ప్రామాణిక తగ్గింపు పన్ను శ్లాబుల్లో మార్పులేమీ లేవు. అయితే, వేతన జీవులకు స్థూల వేతనంలో ప్రామాణిక తగ్గింపు రూ.40,000ను తిరిగి ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీన్ని ఫైనాన్స్‌ యాక్ట్‌ 2005లో రద్దు చేశారు. ప్రామాణిక తగ్గింపు అన్నది ఇంతకుముందు ఉన్న ప్రతీ నెలా రూ.1,600 ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్‌, ఏటా

Most from this category