STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 19 పాయింట్లు అప్‌

Wednesday 24th April 2019
Markets_main1556075801.png-25301

ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో వున్నప్పటికీ, వరుసగా మూడురోజులపాటు భారీ పతనాన్ని చవిచూసిన భారత్‌ మార్కెట్‌ బుధవారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.45  గంటలకు 19 పాయింట్ల లాభంతో11,605 పాయింట్ల వద్ద కదులుతోంది. మంగళవారం ఇక్కడ నిఫ్టీ ఏప్రిల్‌  ఫ్యూచర్‌ 11,586 పాయింట్ల వద్ద ముగిసింది.  అలాగే కోకకోలా తదితర కార్పొరేట్లు ప్రోత్సాహకర ఫలితాల్ని ప్రకటించడంతో మంగళవారం రాత్రి అమెరికా సూచీలు లాభాలతో ముగిసాయి. తాజాగా ఆసియా సూచీల్లో సింగపూర్‌, తైవాన్‌ సూచీలు మినహా మిగిలినవి కొద్దిపాటి నష్టాలతో ట్రేడవుతున్నాయి.



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 24th April 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు పిర‌మ‌ల్ ఎంట‌ర్‌ప్రైజెస్‌:- కంపెనీ జారీ చేసిన క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్లకు స్వల్ప ధీర్ఘకాలిక రుణ స‌దుపాయాల‌కు ఇక్రా రేటింగ్ సంస్థ ఎ1(+) కేటాయించింది. ఇండ‌స్ ఇండ్‌ బ్యాంక్:- ఇండ‌స్ఇండ్ బ్యాంక్ భార‌తీ ఫైనాన్షియ‌ల్ ఇన్‌క్లూజ‌న్ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.  టైగ‌ర్ లాజిస్టిక్స్‌(ఇండియా):- ఇండియ‌న్ రైల్వేవేస్‌( చిత్తరంజ‌న్ లోకోమోటివ్ వ‌ర్క్స్‌)నుంచి మ‌రో ప్రాజెక్ట్‌ను ద‌క్కించుకుంది.  మెక్న‌ల్లీ భార‌త్ ఇంజ‌నీరిగ్స్ కంపెనీ:- కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా వీరేంద్ర కుమార్ వ‌ర్మ

బుల్‌ రన్‌ ఈ రంగంలోనే...!

Wednesday 24th April 2019

పెరుగుతున్న దేశ ప్రజల తలసరి ఆదాయం, పెరుగుతున్న యువ జనాభా ఇవన్నీ వినియోగానికి ఊతమిచ్చేవే. మరి ఈ వినియోగ రంగమే పెట్టుబడులకు మంచి అవకాశాలున్న రంగంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రంగం కచ్చితంగా ర్యాలీ చేస్తుందని, ఇందులో మంచి బెట్స్‌ ఏవన్నది ఎంపిక చేసుకోవడం ఇన్వెస్టర్ల చేతుల్లో ఉందంటున్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాల చర్యలు, మొబైల్‌, ఇంటర్నెట్‌ వినియోగం వేగంగా విస్తరిస్తుండడం వంటి అంశాలు సైతం దేశ వినియోగ

Most from this category