STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Wednesday 10th October 2018
Markets_main1539141457.png-20988

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 18 పాయింట్ల లాభంతో 10,329 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,314 పాయింట్లతో పోలిస్తే 15 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 62 పాయింట్ల నష్టంతో 23,407 పాయింట్ల వద్ద,  హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 75 పాయింట్ల లాభంతో 26,247 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 16 పాయింట్ల నష్టంతో 3,150 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 11 పాయిం‍ట్ల లాభంతో 10,466 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 7 పాయింట్ల నష్టంతో 2,714 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 22 పాయింట్ల నష్టంతో 2,232 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

నాస్‌డాక్‌ అప్‌.. మిగతావి డౌన్‌..
అమెరికా మార్కెట్లు కూడా మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 56 పాయిం‍ట్ల నష్టంతో 26,430 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 4 పాయింట్ల నష్టంతో 2,880 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 7,738 పాయింట్ల వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లలోని అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నెమ్మదించొచ్చనే భయాలు ప్రతికూల ప్రభావం చూపాయి.



You may be interested

మార్కెట్‌ ఎటు?

Wednesday 10th October 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 56 పాయిం‍ట్ల నష్టంతో 26,430 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 4 పాయింట్ల నష్టంతో 2,880 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 7,738 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నెమ్మదించొచ్చనే భయాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన

మారుతి రివర్స్‌ జర్నీ ఎక్కడి వరకు?

Wednesday 10th October 2018

కార్ల రంగంలో రారాజు ‘మారుతి సుజుకి’ షేరు గత నెలన్నర రోజులుగా బేల చూపులు చూస్తోంది. గతేడాది డిసెంబర్‌లో నమోదైన గరిష్ట ధర రూ.9,996 నుంచి ఇప్పటికి 33 శాతం క్షీణించింది. మంగళవారం నాటి క్లోజింగ్‌ ధర రూ.6,691.90. మంగళవారం ఒక్కరోజే మూడు శాతం పడిపోయింది. బలమైన ఆర్థిక మూలాలు, అధిక మార్కెట్‌ వాటా కలిగిన మారుతి ఈ విధంగా పడిపోవడంతో... ఈ పతనం ఎంత వరకు? అన్న సందేహం

Most from this category