STOCKS

News


భారీ లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Wednesday 17th October 2018
Markets_main1539747010.png-21213

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం భారీ లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:48 సమయంలో 124 పాయింట్ల లాభంతో 10,709 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,589 పాయింట్లతో పోలిస్తే 120 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ బుధవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాలతో కళకళలాడతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు మంగళవారం 2 శాతానికి పైగా పెరిగాయి.  

ఆసియా మార్కెట్లు లాభాల్లో..

అమెరికా మార్కెట్ల జోరు ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 358 పాయింట్ల లాభంతో 22,907 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 49 పాయింట్ల లాభంతో 3,083 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 113 పాయిం‍ట్ల లాభంతో 10,093 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 11 పాయింట్ల లాభంతో 2,557 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 28 పాయింట్ల లాభంతో 2,173 పాయింట్ల వద్ద ఉన్నాయి. కాగా హాంగ్‌ కాంగ్‌ మార్కెట్‌కు సెలవు. హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ మంగళవారం 17 పాయింట్ల లాభంతో 25,462 పాయింట్ల వద్ద ముగిసింది. 

అమెరికా మార్కెట్‌ అప్‌..
కంపెనీలు ఎర్నింగ్స్‌ అదిరిపోవడంతో అమెరికా మార్కెట్‌ మంగళవారం లాభాల్లో ముగిసింది. యునైటెడ్‌ హెల్త్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ వంటి దిగ్గజ కంపెనీలు బలమైన ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. అలాగే ఆర్థిక గణాంకాలు పటిష్టంగా ఉండటం మరో సానుకూల అంశం. దీంతో ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పెరిగాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.17 శాతం లేదా 547 పాయిం‍ట్ల లాభంతో 25,798 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 2.15 శాతం లేదా 59 పాయింట్ల లాభంతో 2,809 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.89 శాతం లేదా 214 పాయింట్ల లాభంతో 7,645 పాయింట్ల వద్ద ముగిసింది.



You may be interested

మార్కెట్‌ పయనం ఎటు?

Wednesday 17th October 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ కంపెనీలు ఎర్నింగ్స్‌ అదిరిపోవడంతో అమెరికా మార్కెట్‌ మంగళవారం లాభాల్లో ముగిసింది. యునైటెడ్‌ హెల్త్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ వంటి దిగ్గజ కంపెనీలు బలమైన ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. అలాగే ఆర్థిక గణాంకాలు పటిష్టంగా ఉండటం మరో సానుకూల అంశం. దీంతో ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పెరిగాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.17 శాతం లేదా 547 పాయిం‍ట్ల లాభంతో 25,798 పాయింట్ల వద్ద ముగిసింది.

ఎన్నికల తర్వాత 44,000కు సెన్సెక్స్‌

Wednesday 17th October 2018

సమీప కాలంలో సెన్సెక్స్‌ 36,000-36,500 వరకు వెళుతుందని, వచ్చే సాధారణ ఎన్నికల అనంతరం 44,000కు చేరుకుంటుందని ఎన్‌వీఎస్‌ బ్రోకరేజ్‌ డైరెక్టర్‌ నలిన్‌షా అంచనా వ్యక్తం చేశారు. మార్కెట్‌ కరెక్షన్‌ ముగిసిందని, సెన్సెక్స్‌ 22,900 స్థాయిలో బోటమ్‌ అయినట్టు తాము భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాల ఎన్నికల చుట్టూ ఉన్న అనిశ్చితి, కేంద్రం ఎగుమతులను పెంచలేకపోవడం రూపాయిపై ఒత్తిడికి దారితీస్తాయన్నారు. ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగంలోని అగ్రగామి కంపెనీలు బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌

Most from this category