10,900 పైన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ
By Sakshi

ఎస్‌జీఎక్స్ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి లాభాలతోనే ముగిసింది. సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 2 పాయింట్ల లాభంతో 10,912 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్ శుక్రవారం ముగింపు స్థాయి 10,900 పాయింట్లతో పోలిస్తే 12 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా లాభాల్లోనే ముగిశాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లోనే క్లోజయ్యాయి. ఇండియన్ మార్కెట్ల విషయానికి వస్తే.. ఇండెక్స్‌లు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 24 పాయింట్ల లాభంతో 36,194 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 10,877 పాయింట్ల వద్ద ముగిశాయి. వారం పరంగా చూస్తే.. స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 1,213 పాయింట్లు (2.34 శాతం), నిఫ్టీ 350 పాయింట్లు (3.32 శాతం) చొప్పున పెరిగాయి.
You may be interested
నవంబర్ మారుతి అమ్మకాలు మందగించాయ్
Saturday 1st December 2018మారుతి విక్రయాలు నవంబర్‌లో స్వల్పంగా మందగించాయి. ఎంట్రీ లెవల్ కార్లకు డిమాండ్ పెరగడం, ఎగుమతులు భారీగా క్షీణించడటం విక్రయాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ తెలిపింది. నవంబర్‌లో మొత్తం 1.53లక్షల యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో విక్రయించిన మొత్తం 1.54లక్షల యూనిట్లతో పోలిసే ఇది 0.7శాతం తక్కువ. మిని సిగ్మెంట్ విభాగంలోని అల్టో, వేగానర్ కార్ల అమ్మకాలు ఈ నెలలో 21.6శాతం క్షీణించాయి. గతేడాది నవంబర్‌లో ఈ విభాగంలో మొత్తం 38,204
నమోదు కాకపోయినా చట్టం, శిక్షలు వర్తిస్తాయ్!
Saturday 1st December 2018సాక్షి, హైదరాబాద్: రెరాలో ప్రాజెక్ట్‌లు లేదా డెవలపర్లు, ఏజెంట్ల నమోదు అనేది ఒక ఆప్షన్ మాత్రమే. రెరాలో నమోదు చేయనంత మాత్రాన ఆ ప్రాజెక్ట్ రెరా పరిధిలోకి రాదని భావించొద్దు. రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే నమోదు కాకపోయినా సరే రెరా చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలు చేయవచ్చని మధ్యప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ (రెరా) అథారిటీ చైర్మన్ ఆంటోని డీ సా తెలిపారు. ఇటీవల నగరంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్