STOCKS

News


ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 15th December 2018
Markets_main1544857470.png-22965

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి ఫ్లాట్‌గా ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.50 పాయింటు లాభంతో 10,831 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,820 పాయింట్లతో పోలిస్తే 11 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లోనే క్లోజయ్యాయి. అయితే ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిసింది. స్టాక్‌ సూచీలు లాభపడటం ఇది వరుసగా నాలుగో రోజు. కీలకమైన ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. చైనా, యూరప్‌ల ఆర్థిక వృద్ధి, అమెరికా- చైనాల మధ్య ఉద్రిక్తతలపై ఆందోళనల కారణంగా ఆసియా, యూరప్‌ మార్కెట్లు నష్టపోయినప్పటికీ, మన మార్కెట్‌ ముందుకే సాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 33 పాయింట్ల లాభంతో 35,963 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 10,805 పాయింట్ల వద్ద ముగిశాయి. 



You may be interested

ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ను ఏం చేద్దాం?

Saturday 15th December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తాజాగా ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ షేరును కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: జియోజిత్‌ స్టాక్‌: ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.276 రిటర్న్‌ అంచనా: 10 శాతం జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌.. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌పై నమ్మకంతో ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.276గా నిర్ణయించింది. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ స్టోరేజ్‌ బ్యాటరీ వ్యాపారంలో 60 శాతం వాటాతో

వాల్‌ స్ట్రీట్‌ క్రాష్‌

Saturday 15th December 2018

అమెరికా మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. ఇండెక్స్‌లు 2 శాతం మేర పడిపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.02 శాతం లేదా 497 పాయిం‍ట్ల నష్టంతో 24,100 పాయింట్ల వద్ద ముగిసింది. మే నెల నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. యాపిల్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ షేర్లు నష్టపోవడం ఇండెక్స్‌ను కుంగదీసింది. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే డౌజోన్స్‌ లాభాలన్నీ అవిరయ్యి.. 2.5 శాతం మేర నష్టపోయింది. ఎస్‌అండ్‌పీ

Most from this category