STOCKS

News


11800 వద్ద ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 19th April 2019
Markets_main1555655657.png-25225

విదేశీ మార్కెట్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం 11800ల స్థాయికి అందుకుంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో ఉదయం గం.11:30ని.లకు 11800ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు  గురువారం ముగింపు 11771తో పోలిస్తే 29 పాయింట్ల లాభంతో ఉందనే విషయాన్ని గమనించాలి. ఇక నేడు ఆసియాలోని అన్ని మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. తైవాన్‌, కోప్పి, చైనా షాంఘై కాంపోజిట్‌ సూచీలు 0.10శాతం లాభపడ్డాయి. మరోవైపు నేడు క్రిస్మస్‌ సందర్భరంగా స్ట్రైట్స్‌ టైమ్స్‌, హాంగ్‌సాంగ్‌ మార్కెట్లకు సెలవు.



You may be interested

అప్పులున్న కంపెనీలకు ‘జెట్‌’ భయాలు

Friday 19th April 2019

భారీగా పతనమైతున్న షేర్ల ధరలు భారీగా రుణభారమున్న కంపెనీలకు జెట్‌ సెగలు తగులుతున్నాయి. రుణాలు తీర్చలేక కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు గురువారం భారీగా పతనమైన సంగతి తెలిసిందే. ఈ సెగలు అప్పులు ఎక్కువున్న ఇతర కంపెనీలకు కూడా తాకాయి. దీంతో సదరు కంపెనీల షేర్లు సైతం క్రాష్‌ అయ్యాయి. ముఖ్యంగా అనీల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీలపై జెట్‌ ప్రభావం ఎక్కువగా కనిపించింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీలో

వృద్ధి కోసమే రేట్ల కోత

Friday 19th April 2019

వెలుగుచూసిన ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ వివరాలు ముంబై: దేశ వృద్ధి అవకాశాలు బలహీనపడడం, అదే సమయంలో అంతర్జాతీయ మందగమన అంశాలు రెపో రేటును పావు శాతం తగ్గించేలా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఓటు వేసేందుకు దారి చూపించాయి. ఈ నెల మొదటి వారంలో జరిగిన ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్షా సమావేశంలో రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం వెలువడిన విషయం తెలిసిందే. నాటి సమావేశంలో కమిటీ సభ్యుల

Most from this category