STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Thursday 25th April 2019
Markets_main1556162635.png-25339

ప్రధాన ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో వున్నప్పటికీ,క్రితం రోజు భారీగా పెరిగిన భారత్‌ మార్కెట్‌ గురువారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.40  గంటలకు 4 పాయింట్ల లాభంతో11,730 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ నిఫ్టీ ఏప్రిల్‌ ఫ్యూచర్‌ 11,726 పాయింట్ల వద్ద ముగిసింది.  బుధవారం రాత్రి అమెరికా సూచీలు నష్టాలతో ముగిసాయి. తాజాగా ఆసియా సూచీల్లో జపాన్‌,  తైవాన్‌ సూచీలు మినహా మిగిలినవి కొద్దిపాటి నష్టాలతో ట్రేడవుతున్నాయి.



You may be interested

2019లో సంపద సృష్టి ఎంతో ఈజీ!

Thursday 25th April 2019

కష్టమేనన్న ఎక్కువ మంది న్యూఢిల్లీ: ఎన్నికల ఏడాదిలో సంపద సృష్టికి మెండుగా అవకాశాలున్నాయనే ఆశావహ పరిస్థితి దేశంలోని అత్యధిక సంపన్నుల్లో వ్యక్తమవుతోంది. 28 శాతం మంది అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇది అంతర్జాతీయ సగటు 12 శాతం కంటే రెట్టింపు అని నైట్‌ఫ్రాంక్‌ సర్వే వెల్లడించింది. ఈ సంస్థ అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల దృక్పథాలను తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించింది. ఎన్నికల సంవత్సరం అయినప్పటికీ అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు దేశ వృద్ధి

రీట్‌ కిందకు 35 బిలియన్‌ డాలర్ల కార్యాలయ స్థలాలు

Thursday 25th April 2019

జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ల (రీట్‌) కింద భవిష్యత్తులో అన్ని రకాల వాణిజ్య ఆస్తులు లిస్టింగ్‌కు వచ్చే వీలుందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా వేసింది. భారత్‌లో ప్రస్తుతం 35 బిలియన్‌ డాలర్ల విలువైన కార్యాలయ స్థలాలు రీట్‌ కింద లిస్టింగ్‌కు అర్హత కలిగినవని ఈ సంస్థ తాజాగా ఒక నివేదికలో తెలిపింది. అద్దెలొచ్చే రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను రీట్‌ కలిగి ఉంటుంది.

Most from this category